రాజయ్యపై ఆరోపణలకుఆధారాలు ఇవ్వని నవ్య : జాతీయ మహిళ కమిషన్ కు నివేదిక

By narsimha lode  |  First Published Jul 5, 2023, 1:14 PM IST

స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే  రాజయ్యపై  సర్పంచ్ నవ్య  చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని  పోలీసులు తేల్చారు.
 


హైదరాబాద్: స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే  రాజయ్య పై  సర్పంచ్ నవ్య చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని  పోలీసులు తేల్చారు.ఈ విషయమై  పోలీసులు జాతీయ మహిళా కమిషన్ కు  నివేదిక పంపారు. 

ఎమ్మెల్యే  రాజయ్య తనను లైంగిక వేధింపులకు  పాల్పడినట్టుగా సర్పంచ్ నవ్య ఆరోపణలు  చేశారు.  ఈ విషయమై   జాతీయ మహిళ కమిషన్  నివేదిక కోరింది. ఈ విషయమై  ఆధారాలు సమర్పించాలని  పోలీసులు నవ్యకు  పోలీసులు  నోటీసులు ఇచ్చారు.  అయితే  రెండుసార్లు నోటీసులు  ఇచ్చినా కూడ  నవ్య  ఎలాంటి  ఆధారాలు  సమర్పించలేదని పోలీసులు చెప్పారు. ఆధారాలు సమర్పించనందుకు గాను  కేసును నమోదు చేయలేమని పోలీసులు చెబుతున్నారు. ఈ విషయమై  జాతీయ మహిళ కమిషన్  కు  పోలీసులు  నివేదిక పంపారు.

Latest Videos

ఎమ్మెల్యే రాజయ్యపై  జానకీపురం సర్పంచ్  నవ్య  ఈ ఏడాది  జనవరి మాసంలో ఆరోపణలు  చేశారు.  ఎమ్మెల్యే  రాజయ్య తనను లైంగికంగా వేధించాడని ఆమె ఆరోపించారు. మరో మహిళా నేతతో తనకు  రాయబారం పంపాడని ఆమె  చెప్పారు. అంతేకాదు  ఈ విషయమై  ఎమ్మెల్యే రాజయ్య తనతో ఫోన్ లో  కూడా మాట్లాడారని  ఆరోపణలు  చేశారు. ఈ ఆరోపణలను  రాజయ్య ఖండించారు.  

అయితే  ఈ ఏడాది జూన్  21న  ఎమ్మెల్యే రాజయ్యతో పాటు తన భర్త ప్రవీణ్ పై  కూడ  సర్పంచ్ నవ్య  పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే  చెప్పినట్టుగా   సంతకం పెట్టాలని  తన భర్త కూడ తనపై ఒత్తిడి తీసుకువస్తున్నారని  ఎమ్మెల్యే రాజయ్య, భర్త ప్రవీణ్ పై కూడ ఆమె ఆరోపణలు  చేశారు. గ్రామాభివృద్ది  కోసం  ఎమ్మెల్యే  ఇస్తానన్న రూ. 20 లక్షలు నిధులు ఇవ్వలేదని ఆమె  ఆరోపించారు.  ఈ డబ్బులు ఇచ్చినట్టుగా సంతకాలు పెట్టాలని తనపై ఒత్తిడి తెస్తున్నారని ఆమె  తెలిపారు.

ఈ ఆరోపణలపై   నివేదిక ఇవ్వాలని జాతీయ మహిళ కమిషన్ పోలీసులను ఆదేశించింది.  అయితే  ఈ విషయమై  పోలీసులు రెండుసార్లు  ఆధారాలు ఇవ్వాలని  నవ్యకు  పోలీసులు నోటీసులు ఇచ్చారు. కానీ  పోలీసులకు  నవ్య ఎలాంటి ఆధారాలు ఇవ్వలేదు.  తన వద్ద ఉన్న ఆధారాలను  ఇవ్వాలని  ఎమ్మెల్యే  అనుచరులు ఒత్తిడి తెస్తున్నారని  నవ్య గతంలో ఆరోపణలు  చేసిన విషయం తెలిసిందే. 


 

click me!