కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి కరోనా: హోం ఐసోలేషన్ లో మంత్రి

By narsimha lodeFirst Published Jan 20, 2022, 2:50 PM IST
Highlights


కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి కరోనా సోకింది. ఆయన  ఐసోలేషన్ లో ఉన్నారు. తనను కలిసిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆయన కోరారు. 

హైదరాబాద్: కేంద్ర మంత్రి  కిషన్ రెడ్డికి కరోనా సోకింది. హోం ఐసోలేషన్ లో ఉన్నట్టుగా మంత్రి ప్రకటించారు.

 

I have tested positive for COVID-19 today with mild symptoms. Following all the necessary protocols, I have isolated myself and I am under home quarantine. I request all those who have recently come in contact with me to isolate themselves and get tested.

— G Kishan Reddy (@kishanreddybjp)

ఇటీవల కాలంలో తనను కలిసిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆయన కోరారు.Indiaలో  గత 24 గంటల్లో 3,17,532 coronaకేసులు నమోదయ్యాయి.  అంతేకాదు దేశంలో గత 24 గంటల్లో కరోనాతో 491 మంది మరణించారు. దీంతో దేశ వ్యాప్తంగా కరోనాతో మరణించిన వారి సంఖ్య 4,87,693కి చేరుకొంది.కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 19,24,051గా నమోదైంది. అంతకుముందు రోజుతో పోలిస్తే కరోనా యాక్టివ్ కేసులు 93,051 కేసులు నమోదయ్యాయి. దేశంలో గత 24 గంటల్లో 2,23,990 రికవరీలు నమోదయ్యాయి. దేశంలో కరోనా నుండి కోలుకొన్న రోగుల సంఖ్య 3,58,07,029కి చేరుకొంది.

కరోనా యాక్టివ్ కేసులు 5.03 శాతంగా నమోదయ్యాయి. కరోనా రోగుల రికవరీ రేటు 93.69 శాతానికి తగ్గాయి. కేంద్ర ఆరోగ్య శాఖ  మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారంగా దేశంలో ఇప్పటివరకు 9,287 Omicron కేసులు నమోదయ్యాయి.  బుధవారం నుండి ఈ కేసుల్లో 3.63 శాతం పెరుగుల కన్పిస్తోందని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.

కరోనా రోజువారీ పాజిటివిటీ రేటు 16.41 శాతంగా నమోదైంది. వీక్లీ పాజిటివిటీ రేటు 16.06 గా నమోదైంది. దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద ఇప్పటివరకు 159.67 కోట్ల వ్యాక్సిన్ అందించారు. అంతకుముందు రోజుతో పోలిస్తే కరోనా కొత్త కేసుల నమోదులో 16.41 శాతంగా నమోదైంది.గత ఏడాది మే 15న 3,11,077 కరోనా కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత మూడు లక్షలను దాటడం ఇదే ప్రథమమని కేంద్ర ఆరోగ్య శాఖాధికారుల గణాంకాలు చెబుతున్నాయి.

 కేరళ రాష్ట్రంలో కరోనా పాజిటివిటీ రేటు 37 శాతానికి పెరిగింది. కేరళలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతూనే ఉంది. వచ్చే మూడు వారాలు చాలా కీలకమని కేరళ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జి చెప్పారు. 

పంజాబ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో7,849 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో వైపు 27 మంది కరోనాతో మరణించారు. దేశంలో మొత్తం 6,84,664 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసులు 45,505కి చేరుకొన్నాయి.

అసోం రాష్ట్రంలో కరోనా కేసులు అత్యధికంగా నమోదయ్యాయి. ఒక్క రోజులనే 8,339 కరోనా కేసులు రికార్డయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 6,70,128కి చేరుకొంది. కరోనా యాక్టివ్ కేసులు 35,161 గా నమోదయ్యాయి.ఢిల్లీలో గత 24 గంటల్లో 13,785 కరోనా కేసులు రికార్డయ్యాయి. అంతేకాదు 35 మంది కరోనాతో మరణించారు. ఒక్క రోజు వ్యవధిలో కరోనాతో 16,580 మంది కోలుకొన్నారు. కరోనా యాక్టివ్ కేసులు 75,282గా నమోదైంది. ఢిల్లీలో నిర్వహించిన కరోనా పాజిటివిటీ రేటు పెరిగింది. కరోనా పాజిటివిటీ రేటు 23.86 శాతంగా నమోదైంది.

రాష్ట్రంలో కరోనా ఆంక్షలను సడలించడానికి ఇది సమయం కాదని ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్రజైన్ చెప్పారు.  ఢిల్లీలో గాలి నాణ్యత కూడా భారీగా తగ్గిందని గణాంకాలు చెబుతున్నాయి. ఆయా రాష్ట్రాల్లో కరోనా పరీక్షలను పెంచాలని కేంద్రం సూచించింది. దీంతో ఢిల్లీ ప్రభుత్వం కూడా కరోనా నిర్ధారణ పరీక్షలను పెంచింది. కరోనా కేసుల వ్యాప్తిని తగ్గించేందుకు ఆయా రాష్ట్రాలు జాగ్రత్తలు తీసుకొంటున్నాయి.
 

click me!