పెరుగుతున్న కరోనా కేసులు.. రేపటి నుంచి తెలంగాణలో ఇంటింటి ఫీవర్ సర్వే: హరీశ్ రావు

By Siva KodatiFirst Published Jan 20, 2022, 2:42 PM IST
Highlights

రాష్ట్రంలో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇంటింటి ఫీవర్ సర్వేకు (fever survey) తెలంగాణ సర్కార్ (telangana govt) సిద్ధమైంది. ఇంటింటి సర్వే సందర్భంగా ఎవరికైనా వ్యాధి లక్షణాలుంటే వెంటనే వారికి హోమ్ ఐసోలేషన్ కిట్లు (home isolation kits) ఇచ్చి వారు మందులు ఎలా వాడుకోవాలో కూడా అందులో తెలుగు, ఇంగ్లీష్‌లో రాసిన పాంప్లిట్ కూడా ఇస్తామని హరీశ్ తెలిపారు

రాష్ట్రంలో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇంటింటి ఫీవర్ సర్వేకు (fever survey) తెలంగాణ సర్కార్ (telangana govt) సిద్ధమైంది. దీనిపై మంత్రి హరీశ్ రావు (harish rao) గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ఇంటింటి సర్వే సందర్భంగా ఎవరికైనా వ్యాధి లక్షణాలుంటే వెంటనే వారికి హోమ్ ఐసోలేషన్ కిట్లు (home isolation kits) ఇచ్చి వారు మందులు ఎలా వాడుకోవాలో కూడా అందులో తెలుగు, ఇంగ్లీష్‌లో రాసిన పాంప్లిట్ కూడా ఇస్తామని హరీశ్ తెలిపారు. ఈ విధానం సెకండ్ వేవ్‌లో అద్భుతమైన ఫలితాలను అందించిందని మంత్రి వెల్లడించారు.

ప్రస్తుతం రాష్ట్రంలో మరోసారి కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ముందు జాగ్రత్తగా రేపటి నుంచి సర్వే నిర్వహించి .. ప్రజలకు అందుబాటులో మందులు పెడతామని హరీశ్ తెలిపారు. రాష్ట్రంలో ముందస్తుగా కేసీఆర్.. పరిస్ధితిపై రివ్యూ చేశారని, దీనిలో భాగంగా రెండు కోట్ల టెస్టింగ్ కిట్లు, ఒక కోటీ హోం ఐసోలేషన్ కిట్లను రెడీ చేసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖను ఆదేశించారని హరీశ్ గుర్తుచేశారు. ఆయన సూచనల మేరకు అన్ని విధాలా సిద్ధంగా వున్నామని మంత్రి వెల్లడించారు. మార్కెట్‌లో ప్రస్తుతం టెస్టింగ్ కిట్ల కొరత వుందని.. ధరలు కూడా పెంచాయని హరీశ్ రావు చెప్పారు. ఈ కిట్లు అన్ని జిల్లాలకు  అన్ని ఏరియా ఆసుపత్రులకు, అన్ని పీహెచ్‌సీలకు పంపామని తెలిపారు. 

గ్రామాలలో పంచాయతీ సెక్రటరీ, ఎంపీపీ, ఎంపీడీవోలు.. పట్టణ ప్రాంతాలలో మున్సిపల్ శాఖ అధికారులు.. ఇంటింటి సర్వే చేస్తారని మంత్రి వెల్లడించారు. ఆసుపత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్లు కూడా సిద్ధంగా వున్నాయని.. దీని సామర్ధ్యం మరింత పెంచుతామని హరీశ్ రావు చెప్పారు. తెలంగాణలో 56 వేల కోవిడ్ పడకలు సిద్ధంగా వున్నాయని.. 76 ఆసుపత్రుల్లో ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్‌లను ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు. 340 మెట్రిక్ టన్నులకు ఆక్సిజన్ ఉత్పత్తి సామర్ధ్యాన్ని పెంచుకున్నామని.. దీనిని రాబోయే కాలంలో 500 మెట్రిక్ టన్నులకు పెంచుకుంటామని హరీశ్ రావు వెల్లడించారు. 

స్వల్ప లక్షణాలు కనిపించిన వెంటనే దగ్గరలోని ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదిస్తే హోం ఐసోలేషన్ కిట్లు అందజేస్తామని దీనిని సక్రమంగా వాడితే.. 99 శాతం ఇంట్లోనే కరోనా తగ్గిపోతుందని మంత్రి చెప్పారు. ఒకవేళ పరిస్ధితి విషమంగా వున్న ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలను మానిటర్ చేయమని చెప్పినట్లు హరీశ్ పేర్కొన్నారు. ఫస్ట్, సెకండ్ డోస్‌లను వేగంగా పంపిణీ చేశామని.. బూస్టర్ డోసును అందజేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. మంత్రులు సైతం స్వయంగా జిల్లాల్లో కరోనా పరిస్ధితిని సమీక్షిస్తున్నారని హరీశ్ రావు పేర్కొన్నారు. వ్యాక్సినేషన్‌లో కూడా తెలంగాణ ముందంజలో వుందని.. ఏ జిల్లాలో తక్కువ వ్యాక్సినేషన్ వుందో వాటిపై ఎక్కువ దృష్టి పెడుతున్నామని మంత్రి తెలిపారు. 

click me!