బీజేపీ తెలంగాణ శాఖకు కొత్త బాస్: అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన కిషన్ రెడ్డి

Published : Jul 21, 2023, 02:36 PM ISTUpdated : Jul 21, 2023, 02:58 PM IST
బీజేపీ తెలంగాణ శాఖకు కొత్త బాస్:  అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన  కిషన్ రెడ్డి

సారాంశం

  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా  కిషన్ రెడ్డి  శుక్రవారంనాడు బాధ్యతలు స్వీకరించారు.

హైదరాబాద్: బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి  శుక్రవారంనాడు బాధ్యతలు స్వీకరించారు. పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించడానికి ముందు  నగరంలో పలు దేవాలయాల్లో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన  బండిసంజయ్ నుండి కిషన్ రెడ్డి పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన  కిషన్ రెడ్డికి  బండి సంజయ్ మిఠాయి తినిపించారు.  బీజేపీ అగ్రనేతలు  ప్రకాష్ జవదేకర్, తరుణ్ చుగ్, ఈటల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల మొదటి వారంలో  కిషన్ రెడ్డిని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించింది.  అయితే  ఇవాళ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. 

ఈ ఏడాది చివర్లో జరిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కొరకు  బీజేపీ జాతీయ నాయకత్వం  సంస్థాగత మార్పులు చేసింది.ఈ క్రమంలోనే  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న  బండి సంజయ్ ను తప్పించి  ఆయన స్థానంలో  కిషన్ రెడ్డిని నియమించింది.  బండి సంజయ్ ను బీజేపీ జాతీయ నాయకత్వంలోకి తీసుకుంది.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు దఫాలు కిషన్ రెడ్డి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. తెలంగాణ రాష్ట్రంలో కూడ  బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు.  

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు దఫాలు కిషన్ రెడ్డి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. తెలంగాణ రాష్ట్రంలో కూడ  బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు. 
 బీజేపీ జాతీయ  నాయకత్వం మరోసారి  కిషన్ రెడ్డికి అధ్యక్ష బాధ్యతలను  అప్పగించింది.

also read:భాగ్యలక్ష్మి ఆలయంలో పూజలు: నేడు బీజేపీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్న కిషన్ రెడ్డి

2024 ఎన్నికల్లో దక్షిణాది రాష్ట్రాల్లో అత్యధిక  స్థానాలను దక్కించుకోవాలని బీజేపీ వ్యూహరచన చేస్తుంది. ఈ క్రమంలోనే ఇటీవలనే  హైద్రాబాద్ లో బీజేపీ దక్షిణాది రాష్ట్రాల అధ్యక్షులతో  జేపీ నడ్డా సమావేశమయ్యారు. దక్షిణాదిలో  వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై  చర్చించారు.  దక్షిణాదిలోని  తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అధికారంలోకి రావాలని బీజేపీ ప్లాన్  చేస్తుంది . ఈ దిశగా  ఆ పార్టీ నాయకత్వం  వ్యూహలు రచిస్తుంది.  


 

 


 

 

PREV
click me!

Recommended Stories

KCR Press Meet from Telangana Bhavan: చంద్రబాబు పై కేసీఆర్ సెటైర్లు | Asianet News Telugu
KCR Press Meet: ఇప్పటి వరకు ఒక లెక్క రేపటి నుంచి మరో లెక్క: కేసీఆర్| Asianet News Telugu