హైదరాబాద్ విమోచన ఉత్సవాలు.. భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం నుంచి బైక్‌ ర్యాలీని ప్రారంభించిన కిషన్ రెడ్డి

By Sumanth KanukulaFirst Published Sep 15, 2022, 1:06 PM IST
Highlights

సెప్టెంబర్ 17 సందర్భంగా కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ విమోచన ఉత్సవాలను నిర్వహిస్తున్న సంగతి  తెలిసిందే. ఈ క్రమంలోనే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నేడు మహిళల బైక్ ర్యాలీని ప్రారంభించారు. 

సెప్టెంబర్ 17 సందర్భంగా కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ విమోచన ఉత్సవాలను నిర్వహిస్తున్న సంగతి  తెలిసిందే. ఈ క్రమంలోనే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నేడు మహిళల బైక్ ర్యాలీని ప్రారంభించారు. బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఈ బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఉదయం చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన కిషన్ రెడ్డి.. అనంతరం బైక్ ర్యాలీని ప్రారంభించారు.  చార్మినార్ భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయం నుంచి మొదలైన మహిళల బైక్ ర్యాలీ.. పరేడ్ గ్రౌండ్ మీదుగా అసెంబ్లీ ఎదురుగా ఉన్న సర్దార్ పటేల్ విగ్రహం వరకు ఈ బైక్ ర్యాలీ కొనసాగనుంది. ఈ బైక్ ర్యాలీలో వందలాది మంది మహిళలు పాల్గొన్నారు. కిషన్ రెడ్డి కూడా బైక్ ర్యాలీలో పాల్గొన్నారు.

ఇక, సెప్టెంబర్ 17న కేంద్ర ప్రభుత్వం నిర్వహించనున్న హైదరాబాద్ విమోచన దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్‌కు రానున్నారు. రెండు రోజుల పాటు అమిత్ షా పర్యటన  కొనసాగనుంది.  శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. హైదరాబాద్ విమోచన దిన్సోతవ వేడుకల్లో భాగంగా.. పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే ప్రధాన కార్యక్రమంలో పాల్గొంటారు. పారా మిలటరీ బలగాల గౌరవ వందనం స్వీకరించి జాతీయ జెండాను ఎగురవేస్తారు.

ఇక, తన పర్యటనలో భాగంగా.. ఇటీవల చనిపోయిన కృష్ణంరాజు కుటుంబ సభ్యులను అమిత్​షా పరామర్శించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. కృష్ణంరాజు సోదరుడి కుమారుడు, ప్రముఖ సినీనటుడితో కూడా సమావేశం కానున్నారు. బీజేపీ నేతల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం..రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా సెప్టెంబర్ 16న కృష్ణంరాజు కుటుంబాన్ని కలిసే అవకాశం ఉంది.

click me!