విలీనం ,విమోచనమంటూ భావోద్వేగాలు రెచ్చగొడుతున్నారు: తెలంగాణ శాసనమండలి చైర్మెన్ గుత్తా

By narsimha lodeFirst Published Sep 15, 2022, 12:10 PM IST
Highlights

విలీనం, విమోచనం అంటూ కొందరు భావోద్వేగాలను రెచ్చగొట్టడాన్ని తెలంగాణ సనమండలి  చైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డి చెప్పారు.
 

హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్  గతంలో ఓ పార్టీకి రాష్ట్ర అధ్యక్షురాలిగా వ్యవహరించారని గుత్తా సుఖేందర్ రెడ్డి చెప్పారు. పూర్వపు పార్టీ అభిప్రాయాన్ని గవర్నర్ వ్యక్తం చేసినట్టుగా ఉందని గుత్తా సుఖేందర్ రెడ్డి అభిప్రాయపడ్డారు.  ప్టెంబర్ 17వ తేదీని విమోచన దినమని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు..గురువారం నాడు తెలంగాణ శాసనమండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.  

 బాధ్యత లేకుండా కొందరు విలీనం, విమోచన దినం అంటూ  ప్రజల భావోద్వేగాలతో చెలగాటమాడుతున్నారని ఆయన మండిపడ్డారు.  తెలంగాణ గవర్నర్ కూడా విమోచన దినం అంటూ వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. గవర్నర్ వ్యవస్థకు ఉండే గౌరవాన్ని పోగోట్టుకోవద్దని ఆయన కోరారు. కేంద్ర ప్రభుత్వం పెడరల్ వ్యవస్థకు విఘాతం కల్గించేలా వ్యవహరిస్తుందన్నారు.  సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో కేంద్రం సభ నిర్వహించడం సరైంది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. 

సెప్టెంబర్ 17వ తేదీన విమోచన దినోత్సవాన్ని నిర్వహించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ  కార్యక్రమంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పాల్గొంటారు.  సికింద్రాాబాద్ పరేడ గ్రౌండ్స్ లో నిర్వహించే కార్యక్రమంలో కర్ణాటక, మహరాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల సీఎంలకు కేంద్రం ఆహ్వానం పంపింది.  అయితే అదే రోజున జాతీయ సమైఖ్యత దినోత్సవాన్ని జరుపుకోవాలని టీఆర్ఎస్ సర్కార్ నిర్ణయం తీసుకొంది. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో సెప్టెంబర్ 17వ తేదీని అధికారికంగా నిర్వహించాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత సెప్టెంబర్ 17వ తేదీ గురించి టీఆర్ఎస్ పట్టించుకోలేదు. దీంతతో కేంద్ర ప్రభుత్వం విమోచన దినోత్సవం నిర్వహించాలని నిర్ణయించింది. 
 

click me!