పాలనను సలహదారులకు వదిలేశారు: కేసీఆర్ పై కిషన్ రెడ్డి ఫైర్

By narsimha lode  |  First Published May 21, 2023, 1:21 PM IST

అకాల వర్షంతో  నష్టపోయిన  రైతాంగాన్ని ఆదుకోవడంలో  కేసీఆర్ సర్కార్ వైఫల్యం చెందిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. 



హైదరాబాద్: అకాల వర్షంతో  నష్టపోయిన  రైతాంగాన్ని ఆదుకోవడంలో  కేసీఆర్ వైఫల్యం చెందిందని   కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి  విమర్శించారు.  ఆదివారంనాడు   హైద్రాబాద్ లోని బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో  మాట్లాడారు. పంట  నష్టాన్ని  భరించే స్థిలో  రైతులు  లేరన్నారు.   రాష్ట్రంలో  పంటల భీమా  పథకం అమలు  చేయడం లేదని  ఆయన  విమర్శించారు.  రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాల వల్ల రైతులు తీవ్రంగా న ష్టపోయారని  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గుర్తు చేశారు. 

పంట నష్టపోయి  రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు. మరో వైపు  సహకారం అందక  రైతులు  ఇబ్బంది పడుతున్నారని  కిషన్ రెడ్డి తెలిపారు. రైతులను  ఆదుకోవాల్సిన  బాధ్యత  రాష్ట్ర ప్రభుత్వంపై  ఉందన్నారురాష్ట్రంలో  పరిస్థితులు  అస్తవ్యస్తంగా  ఉంటే  మహారాష్ట్రలో   బీఆర్ఎస్  శాఖ  ఏర్పాటులో  కేసీఆర్   బిజీగా  ఉన్నాడని కేంద్ర మంత్రి  కిషన్ రెడ్డి మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం  యూరియాపై   రూ.8500 సబ్సీడీ అందిస్తుందన్నారు.  ప్రతి   ఎకరానికి డీఏపీపై   నాలుగు బస్తాలపై  రూ. 9,600   సబ్సీడీ ని  కేంద్ర ప్రభుత్వం అందిస్తుందన్నారు.

Latest Videos

undefined

రాష్ట్రంలో  రైతుల సమస్యలను గాలికొదిలేసి  దేశ్ కి నేతగా ప్రచారం చేసుకుంటూ  కేసీఆర్  పర్యటిస్తున్నారని కిషన్ రెడ్డి  విమర్శించారు.యూరియా ధరలు ప్రపంచ మార్కెట్ లో  పెరిగినా  భారత రైతులపై భారం పడకుండా  కేంద్ర ప్రభుత్వం  సబ్సిడీని పెంచిన విషయాన్ని  కిషన్ రెడ్డి  గుర్తు  చేశారు.   రాష్ట్రంలో  రైతుల సమస్యలను పట్టించకొని  కేసీఆర్ సర్కార్  మోడీపై విమర్శలు గుప్పిస్తుందన్నారు.

తెలంగాణ  సీఎం  కేసీఆర్ పాలనను సలహాదారులకు  వదిలేశారని  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు.   రాష్ట్రంలో ప్రజల సమస్యలు పట్టించుకోకుండా  పార్టీ విస్తరణపై కేంద్రీకరించారన్నారు.

 రైతులకు  ఉచితంగా  ఎరువులు ఇస్తామన్న హామీని కేసీఆర్ అమలు చేయలేదని కేంద్ర మంత్రి  కిషన్ రెడ్డి  చెప్పారు.  తాను  ఇచ్చిన హమీలను అమలు చేయలేని  కేసీఆర్  మహారాష్ట్రకు వెళ్లి  మోడీని విమర్శిస్తున్నాడన్నారు.తెలంగాణ  ప్రభుత్వం  ప్రతి ఎకరానికి  రూ. 10 వేల ఇస్తుందన్నారు. కానీ  కేంద్ర ప్రభుత్వం  ప్రతి ఎకరానికి  రూ. 18,254  అందిస్తుందని  కేంద్ర మంత్రి  కిషన్ రెడ్డి  వివరించారు. 
 

click me!