కోడ్ భాషపై ఏటీఎస్ ఆరా: హైద్రాబాద్ లో అరెస్టై న హెచ్‌యూటీ ఉగ్రవాదుల విచారణలో కీలక విషయాలు

By narsimha lode  |  First Published May 21, 2023, 11:09 AM IST

హైద్రాబాద్ లో అరెస్టైన  హెచ్‌యూటీ  ఉగ్రవాదుల విచారణలో   కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి.   నిందితులు  భోపాల్ సమీపంలో  శిక్షణ పొందారని  విచారణ  సంస్థలు గుర్తించాయి. 


భోపాల్: హైద్రాబాద్  లో అరెస్టైన  రాడికల్ ఇస్లామిక్  (హెచ్‌యూటీ)  ఉగ్రవాదుల విచారణలో  పోలీసులు  కీలక విషయాలు కనుగొన్నారు.. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో భోపాల్ శివారులో   నిందితులు  శిక్షణ పొందినట్టుగా  గుర్తించారు.  మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఆచార్ పుర,  బోజ్పుర  శివారు  నీమేడా గ్రామంలో  శిక్షణ పొందారని దర్యాప్తు సంస్థలు  గుర్తించాయని సమాచారం. . 

 మధ్యప్రదేశ్ రాష్ట్రంలో  పలు  ప్రాంతాల్లో  విధ్వంసం కోసం  నిందితులు ప్లాన్  చేశారని దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. ఈ దిశగా  విచారణ  చేస్తున్నాయి. నిందితులు ఉపయోగించిన కోడ్ భాషపై  దర్యాప్తు  సంస్థలు  ఆరా తీస్తున్నాయి.  బిర్యానీ, లడ్డూ వంటి  కోడ్ భాషలపై  దర్యాప్తు సంస్థలు  విశ్లేషిస్తున్నాయి.  నిందితులు  ఉపయోగించిన మొబైల్ ఫోన్లను  ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపారు.  మొబైల్ లో  డేటాను  దర్యాప్తు   అధికారులు   పరిశీలిస్తున్నారు.  

Latest Videos

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని డ్యామ్ లు, స్టేడియాల్లో  నిందితులు  విధ్వంసం  చేసేందుకు  ప్లాన్ చేశారని దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి.  ఈ దిశగా  దర్యాప్తు  చేస్తున్నాయి.  హైద్రాబాద్ లో  నిందితులు  ఉన్న సమయంలో   అనంతగిరి గుట్టల్లో  శిక్షణ పొందారని ఏటీఎస్  గుర్తించింది.  తమ ఉనికి  దొరకకుండా ఉండేందుకు గాను  నిందితులు  డార్క్ వెబ్ సైట్లు  ఉపయోగించారు

ఈ నెల  9వ తేదీన హైద్రాబాద్ లో  అరెస్టైన  16 మందిని ఏటీఎస్  పోలీసులు  శుక్రవారంనాడు కోర్టు లో హాజరుపర్చారు. వీరిలో  ఆరుగురిని  కోర్టు జ్యుడిషీయల్  రిమాండ్ కు తరలించింది.మిగిలిన వారిని  ఏటీఎస్ కస్టడీకి తరలిస్తూ  కోర్టు ఆదేశాలు జారీ చేసింది. నిందితులకు  యాసిర్  నుండి  ఆదేశాలు  వచ్చిన విషయాన్ని దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. యాసిర్ కోసం  ఏటీఎస్ గాలింపు  చర్యలు చేపట్టింది.

also read:ఎన్నికల ముందు విధ్వంసానికి హెచ్‌యూటీ ప్లాన్: ఏటీఎస్ విచారణలో కీలక విషయాలు

దాదాపుగా  రెండేళ్లుగా  హైద్రాబాద్ లో తలదాచుకుంటున్న   హెచ్‌యూటీ  ఉగ్రవాదులపై   ఏటీఎస్ నిఘా పెట్టింది.  ఇప్పటివరకు  22 మందిని   అరెస్ట్  చేశారు.  ఈ నెల  9వ తేదీన  అరెస్టైన  16 మందిలో  11 మంది  మధ్యప్రదేశ్రాష్ట్రానికి  చెందినవారు.  మిగిలిన  ఐదుగురు హైద్రాబాద్ వాసులు. ఈ నెల  10న  ఒకరు హూద్రాబాద్ లో అరెస్టయ్యారు. ఈ నెల  15న మరో ఇద్దరిని అరెస్ట్  చేశారు. ఈ నెల  18న మరో  ముగ్గగురిని  హైద్రాబాద్ లో  అరెస్ట్  చేశారు.
 

tags
click me!