అదే నా జీవితంలో సంతోషకరమైన రోజు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

Published : Aug 24, 2021, 12:51 PM ISTUpdated : Aug 24, 2021, 12:59 PM IST
అదే నా జీవితంలో సంతోషకరమైన రోజు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

సారాంశం

ఆర్టికల్ 370 రద్దు చేసిన సమయంలో తాను హోంశాఖ మంత్రిగా ఉన్నానని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. 370 ఆర్టికల్ రద్దు తన జీవితంలో అత్యంత సంతోషకరమైన రోజుగా ఆయన చెప్పారు.

హైదరాబాద్ :ఆర్టికల్ 370 రద్దు తన జీవితంలో సంతోషకరమైన అంశమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. మంగళవారం నాడు ఆయన హైద్రాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.  

తాను హోం శాఖ సహాయ మంత్రిగా ఉన్న సమయంలోనే 370 ఆర్టికల్ రద్దు   చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. మూడు శాఖలకు మత్రిగా పనిచేయడం టెన్షన్‌తో కూడిన బాధ్యతగా ఆయన చెప్పారు. 

ఈశాన్య రాష్ట్రాల అభివృద్ది లక్ష్యంగా పని చేస్తానని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. బడ్జెట్‌లో కచ్చితంగా 10 శాతం నిధులను ఈశాన్య రాష్ట్రాలకు ఖర్చు చేయాల్సిన అవసరం ఉందన్నారు

2047 నాటికి దేశం గొప్పగా అభివృద్ది చెందాలని తమ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందన్నారు. ఈ మేరకు దేశాభివృద్దిలో యువత కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందన్నారు. 

2047 నాటికి దేశాభివృద్ది కోసం  ప్రతి ఒక్కరి అభిప్రాయాలను సేకరిస్తున్నామన్నారు.  ఈ మేరకు రెండేళ్లపాటు ప్రజల నుంి అభిప్రాయాలను సేకరిస్తామన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.
 

PREV
click me!

Recommended Stories

South Central Railway Announces Special Trains for Sankranthi 2026 | Pongal | Asianet News Telugu
Hyderabad History: నిజాంలనాటి చివరిగుర్తులు, మిగిలింది ఇవే..