13 యేళ్ల కుర్రాడు.. బిర్యానీ కోసం దారుణానికి తెగబడ్డాడు.. ఏం చేశాడంటే...

Published : Aug 24, 2021, 12:30 PM IST
13 యేళ్ల కుర్రాడు.. బిర్యానీ కోసం దారుణానికి తెగబడ్డాడు.. ఏం చేశాడంటే...

సారాంశం

బీహార్ కు చెందిన బాలుడు లేబర్ పనులు చేసుకుంటూ అబ్దుల్లాపూర్ మెట్ మండలం మునగనూరు అంజనాద్రి నగర్ లో ఉంటున్నాడు. స్థానికంగా శనివారం ఓ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇనుపరాడ్డుతో తాళం పగలగొట్టి చోరీకి పాల్పడ్డాడు. 

ఆ బాలుడి వయస్సు 13 యేళ్లే కానీ అతని మీద ఒక్క ఠాణా పరిధిలోనే 10 చోరీ కేసులు నమోదయ్యాయి. తాజాగా రెండు రోజుల క్రితం ఆ బాలుడు మునగనూరు అంజనాద్రినగర్ లో చోరీకి పాల్పడడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. విచారించగా ఆర్నెళ్ల వ్యవధిలోనే హయత్ నగర్ ఠాణా పరిధిలో వేర్వేరు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడడంతో ఇప్పటికే పది కేసులు నమోదైనట్లు తేలింది. 

హయత్ నగర్ సీఐ సురేందర్ గౌడ్ కథనం మేరకు.. బీహార్ కు చెందిన బాలుడు లేబర్ పనులు చేసుకుంటూ అబ్దుల్లాపూర్ మెట్ మండలం మునగనూరు అంజనాద్రి నగర్ లో ఉంటున్నాడు. స్థానికంగా శనివారం ఓ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇనుపరాడ్డుతో తాళం పగలగొట్టి చోరీకి పాల్పడ్డాడు. 

బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద రూ.60వేల విలువైన బంగారం, 70 గ్రాముల వెండి, రూ.4వేలు, ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. బిర్యాన, చిరుతిళ్లకు అలవాటు పడి సునాయాసంగా డబ్బు సంపాదించేందుు చోరీల బాటపట్టాడు. 

గతంలోనూ అతన్ని అదుపులోకి తీసుకుని బాల నేరస్తుల హోం కు తరలించగా విడుదలైన తర్వాత కూడా చోరీలు కొనసాగిస్తున్నాడు. స్థానికంగా తాళం వేసిన ఇళ్లను ఎంచుకుని గుట్టుచప్పుడు కాకుండా ఇంట్లోకి చొరబడి దొంగతనాలకు పాల్పడుతున్నట్లు సీఐ వెల్లడించారు. 

PREV
click me!

Recommended Stories

Sydney Bondi Beach ఉగ్రదాడి: నిందితుడు సాజిద్ అక్రమ్‌కు హైదరాబాద్ లింకులు.. భారత పాస్‌పోర్ట్‌తో షాకింగ్ !
Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?