
హైదరాబాద్: ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగులు హైద్రాబాద్‌లోని ప్రగతి భవన్ ముట్టడికి మంగళవారం నాడు ప్రయత్నించారు. ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులతో ఆందోళనకారులు గొడవకు దిగారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట చేసుకొంది. కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది.
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగులు ఇవాళ ప్రగతి భవన్ ముట్టడికి వచ్చారు. ఆందోళనకారులను పోలీసులు అడ్డుకొన్నారు. ఆందోళనకారులను అరెస్ట్ చేసి గోషామహల్ పోలీస్ స్టేషన్ కి తరలించారు.
ప్రగతి భవన్ వద్ద ఉన్న గేటు ఎక్కి ఆందోళనకారులు కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారిని అడ్డుకొని అరెస్ట్ చేశారు. నిరుద్యోగుల ఆందోళనతో ప్రగతి భవన్ వద్ద ట్రాఫిక్ కు కొద్దిసేపు అంతరాయం ఏర్పడింది.రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలనే 50వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని నిర్ణయం తీసుకొంది. ఈ మేరకు కేబినెట్ కూడ ఈ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.