అసెంబ్లీలో కేటీఆర్ తీరుపై స్పీకర్‌కు కాంగ్రెస్ ఫిర్యాదు.. సమావేశాన్ని బాయ్‌కాట్ చేసిన సీతక్క..!!

Published : Aug 06, 2023, 01:02 PM IST
 అసెంబ్లీలో కేటీఆర్ తీరుపై స్పీకర్‌కు కాంగ్రెస్ ఫిర్యాదు.. సమావేశాన్ని బాయ్‌కాట్ చేసిన సీతక్క..!!

సారాంశం

అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి  కేటీఆర్‌ తీరుపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఈరోజు ఉదయం స్పీకర్ పోచారంను కలిసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు.. అసెంబ్లీలో శనివారం కేటీఆర్ తీరుపై ఫిర్యాదు చేశారు.

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి  కేటీఆర్‌ తీరుపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఈరోజు ఉదయం స్పీకర్ పోచారంను కలిసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు.. అసెంబ్లీలో శనివారం కేటీఆర్ తీరుపై ఫిర్యాదు చేశారు. కేటీఆర్ సభలో అబద్దాలు మాట్లాడారని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. అధికార  పార్టీ సభ్యులు సభను తప్పుదోవ పట్టిస్తున్నారని సీఎల్పీ నేత భట్టి  పేర్కొన్నారు. ఆ వ్యాఖ్యలను రికార్డు నుంచి తొలగించాలని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని  కోరారు. 

ఇదిలా ఉంటే.. అసెంబ్లీ సమావేశాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క బాయ్‌కాట్ చేశారు. అసెంబ్లీలో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదని అన్నారు. ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని విమర్శించారు. ఎన్నికల ప్రచారం కోసమే సభను వాడుకుంటున్నారని మండిపడ్డారు. ఓట్ల కోసం, రాజకీయం కోసం సభను వాడుతూ.. ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారని.. ఇది చాలా  దారుణమని అన్నారు. ఏ సమస్య లేనప్పుడే.. అధికార పార్టీ  ఎమ్మెల్యేలకు ఎందుకు మాట్లాడే అవకాశం ఇస్తున్నారని ప్రశ్నించారు. ప్రశ్నలు ఉండొద్దని, సమస్యలు  ప్రస్తావించొద్దని.. కేవలం  భజనలు మాత్రమే  ఉండాలనే  విధంగా  జీరో అవర్, కొశ్చన్ అవర్ పెట్టుకున్నారని మండిపడ్డారు. ఈ పద్దతిని మార్చుకోవాలని డిమాండ్ చేశారు. 
 

PREV
click me!

Recommended Stories

Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్
Hyderabad: ఇది పూర్త‌యితే హైద‌రాబాద్‌లో దేశంలో టాప్ సిటీ కావ‌డం ఖాయం.. ORR చుట్టూ మెగా ప్రాజెక్ట్‌