అవగాహన లేకే విమర్శలు: వ్యాక్సిన్ పై హరీష్‌రావుకు కిషన్ రెడ్డి కౌంటర్

By narsimha lodeFirst Published Jun 6, 2021, 11:34 AM IST
Highlights

 తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకు కేవలం నాలుగు లక్షల డోసులను మాత్రమే కొనుగోలు చేసిందని కేంద్ర హోంశాఖ సహాయ  మంత్రి కిషన్ రెడ్డి  చెప్పారు. తెలంగాణ ఆర్ధికశాఖ మంత్రి హరీష్ రావు వ్యాక్సిన్ విషయంలో చేసిన విమర్శలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. 

హైదరాబాద్:   తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకు కేవలం నాలుగు లక్షల డోసులను మాత్రమే కొనుగోలు చేసిందని కేంద్ర హోంశాఖ సహాయ  మంత్రి కిషన్ రెడ్డి  చెప్పారు. తెలంగాణ ఆర్ధికశాఖ మంత్రి హరీష్ రావు వ్యాక్సిన్ విషయంలో చేసిన విమర్శలకు ఆయన కౌంటర్ ఇచ్చారు.  తెలంగాణ ఆర్ధికశాఖ మంత్రి హరీష్ రావు వ్యాక్సిన్ విషయంలో చేసిన విమర్శలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. 

also read:డిసెంబర్ నాటికి 250 కోట్ల డోసుల వ్యాక్సిన్ ఉత్పత్తి: కిషన్ రెడ్డి

సీతాఫల్‌మండిలో వ్యాక్సిన్ సెంటర్‌ను ప్రారంభించిన సందర్భంగా ఆదివారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు.  తెలంగాణకు 75 లక్షలకు పైగా కరోనా డోసులను కేంద్రమే పంపిణీ చేసిందన్నారు. తెలంగాణలో ప్రస్తుతం భారత్ బయోటెక్ కంపెనీ వ్యాక్సిన్ ఉత్పత్తి చస్తోందన్నారు. భారత్ బయోటెక్ కంపెనీ ఉత్పత్తి చేస్తున్న వ్యాక్సిన్ మొత్తం తెలంగాణకే వినియోగించాలని కోరడం సరైంది కాదన్నారు. ఇతర దేశాల్లో ఉత్పత్తి చేసిన వ్యాక్సిన్ ను  మన రాష్ట్రంలో ఉపయోగించడం లేదా అని ఆయన ప్రశ్నించారు. 

కేసీఆర్ కుటుంబ సభ్యులు వ్యాక్సిన్ విషయంలో అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. తప్పుడు విమర్శలను మానుకోవాలని ఆయన హితవు పలికారు. హైద్రాబాద్ లో కూర్చొని గ్లోబల్ టెండర్లు వేస్తే ఎవరూ కూడ ముందుకు రారన్నారు. వ్యాక్సిన్ విషయంలో  కేంద్రం అన్ని రాష్ట్రాలను సమ దృష్టితో చూస్తోందన్నారు. 


 

click me!