డిసెంబర్ నాటికి 250 కోట్ల డోసుల వ్యాక్సిన్ ఉత్పత్తి: కిషన్ రెడ్డి

By narsimha lodeFirst Published Jun 6, 2021, 10:23 AM IST
Highlights

ఈ ఏడాది డిసెంబర్ నాటికి 250 కోట్ల వ్యాక్సిన్ ఉత్పత్తి చేయాలనే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. 
 

హైదరాబాద్:  ఈ ఏడాది డిసెంబర్ నాటికి 250 కోట్ల వ్యాక్సిన్ ఉత్పత్తి చేయాలనే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి  250 కోట్ల డోసుల వ్యాక్సిన్ ఉత్పత్తి చేస్తే దేశ ప్రజలకు పరిపోతోందన్నారు.   ఈ లక్ష్యాన్ని సాధించే దిశగా అడుగులు వేస్తున్నామన్నారు.  సీతాఫల్‌మండిలో  వ్యాక్సినేషన్ సెంటర్ ను కేంద్ర  మంత్రి కిషన్ రెడ్డి ఆదివారం నాడు ప్రారంభించారు.  ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. 

హైద్రాబాద్ నుండి త్వరలోనే  మరో వ్యాక్సిన్ అందుబాటులోకి రానుందన్నారు. బయోలాజికల్ ఈ సంస్థ తయారు చేస్తున్న వ్యాక్సిన్ కు సంబంధించిన రెండు క్లినికల్ ట్రయల్స్ మంచి ఫలితాలను అందించాయన్నారు. మూడో క్లినికల్ ట్రయల్స్ ప్రస్తుతం జరుగుతున్నాయని ఆయన గుర్తు చేశారు.మేకిన్ ఇండియాలో భాగంగా ఈ సంస్థ వ్యాక్సిన్ తయారీ కోసం  కేంద్రం ఆర్ధిక సహాయం అందించిందని ఆయన తెలిపారు.

వ్యాక్సిన్ ఉత్పత్తిని పెంచినట్టుగా చెప్పారు. విదేశీ కంపెనీలకు చెందిన 16 కంపెనీలతో కూడ వ్యాక్సిన్ కోసం చర్చలు జరుపుతున్నట్టుగా చెప్పారు. రాష్ట్రాలు వ్యాక్సిన్ కొనుగోలు చేయకపోతే ఉత్పత్తి చేసిన వ్యాక్సిన్ ను ఫార్మా కంపెనీల నుండి కేంద్రమే కొనుగోలు చేస్తోందని ఆయన చెప్పారు. 

click me!