పవన్ కళ్యాణ్ ఇంటి వద్ద రెక్కీ నిర్వహించిన అంశంపై రెండు ప్రభుత్వాలు కోరితే తాము విచారణ నిర్వహిస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు.
న్యూఢిల్లీ: జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఇంటి వద్ద రెక్కీ నిర్వహించడంపై తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు విచారణ జరపాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు.శుక్రవారంనాడు న్యూఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు.రెండు ప్రభుత్వాలు ఈ విషయమై తమను కోరితే విచారణ జరిపిస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. పవన్ కళ్యాణ్ ఇంటి వద్ద రెక్కీ నిర్వహించిన విషయాన్ని తాను పత్రికల్లో చూసిన ట్టుగా కిషన్ రెడ్డి చెప్పారు. పనవ్ కళ్యాణ్ ఇంటి వద్ద రెక్కీ నిర్వహించడం సరైంది కాదన్నారు. వచ్చే ఎన్నికల్లో తాము జనసేనతో కలిసి పోటీ చేస్తామని ఆయన స్పష్టం చేశారు.
ఎవరికైనా భద్రతను పెంచడానికి కొన్ని పద్దతులుంటాయని ఆయన చెప్పారు.హైద్రాబాద్ లోని జనసేన నేత పవన్ కళ్యాణ్ నివాసం వద్ద కొందరు అనుమానాస్పద వ్యక్తులు తిరుగుతున్నారని జనసేన నేతలు చెబుతున్నారు. ఈ విషయమై ఆ పార్టీ నేతలు మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరించారు.
undefined
also read:టీఆర్ఎస్ సర్కార్ ను కూల్చాలని అనుకోలేదు:కేసీఆర్ కి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కౌంటర్
పవన్ కళ్యాణ్ ఇంటి వద్ద రెక్కీ అంశానికి సంబంధించి వైసీపీ, జనసేన నేతల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు చోటు చేసుకుంటున్నాయి. విశాఖపట్టణంలో మంత్రుల కాన్వాయిపై జనసేన శ్రేణుల దాడి తరవాత ఈ రెండు పార్టీల మధ్యమాటల యుద్ధం మరింత తీవ్రమైంది. విశాఖలో మంత్రుల కాన్వాయి పై దాడికి తమకు సంబంధం లేదని జనసేన ప్రకటించింది. వైసీపీ నేతలే దాడులు చేయించారని జనసేన ఆరోపించింది. ఈ దాడుల ఘటనలలో సుమారు వంద మందికి పైగా జనసే న శ్రేణులను పోలీసులు అరెస్ట్ చేశారు.