భారత్ జోడో యాత్ర: నేడు పాదయాత్రకు రాహుల్ విరామం

By narsimha lode  |  First Published Nov 4, 2022, 2:02 PM IST

భారత్  జోడోయాత్రకు  కాంగ్రెస్  పార్టీ అగ్రనేత రాహుల్  గాంధీ ఇవాళ తన పాదయాత్రకు బ్రేక్  ఇచ్చారు. రేపు ఉదయం ఆరు  గంటలకు ఆయన  పాదయాత్రను పున: ప్రారంభించనున్నారు.


హైదరాబాద్:భారత్  జోడో యాత్రకు  కాంగ్రెస్ పార్టీ అగ్రనేతరాహుల్  గాంధీ శుక్రవారంనాడు తన పాదయాత్రకు బ్రేక్ ఇచ్చారు. రేపు ఉదయం ఆరు గంటలకు రాహుల్  గాంధీ పాదయాత్రను కొనసాగిస్తారు. ఇవాళ  రాహుల్ గాంధీ  విశ్రాంతి  తీసుకుంటారు. ఇవాళ మధ్యాహ్నం  ప్రజా సంఘాలనేతలతో రాహుల్ గాంధీ సమావేశం  కానున్నారు. 

తెలంగాణ రాష్ట్రంలో  రాహుల్  గాంధీ పాదయాత్ర ఇవాళ్టికి  10  రోజులకు చేరుకుంది.  గత నెల 23న   రాహుల్ గాంధీ పాదయాత్ర కర్ణాటక రాష్ట్రం నుండి  తెలంగాణలోకి  ప్రవేశించింది.ప్రస్తుతం  రాహుల్ గాంధీ పాదయాత్ర సంగారెడ్డి  జిల్లాలో కొనసాగుతుంది.

Latest Videos

గత  నెల  23న రాష్ట్రంలోకి యాత్ర ప్రవేశించింది.అయితే అదే  రోజున నాలుగు  కి.మీ పాదయాత్ర నిర్వహించిన తర్వాత యాత్రకు రాహుల్ గాంధీ విరామం ఇచ్చారు.గత  నెల 27నుండి యాత్ర పున: ప్రారంభమైంది.గత నెల 4,5  తేదీల్లో కర్ణాటకలో యాత్ర సాగే  సమయంలో  రాహుల్ గాంధీ యాత్రకి  విరామం  ఇచ్చారు.

మరో  ఐదు రోజుల పాటు  తెలంగాణలో రాహుల్  గాంధీ పాదయాత్ర సాగనుంది.కాంగ్రెస్  పార్టీ ముఖ్య నేతలు రాహుల్ గాంధీ పాదయాత్రలో పాల్గొంటున్నారు.యాత్రకు  విశేష  స్పందన లభిస్తుందని ఆ   పార్టీ  నేతలు చెబుతున్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను కాంగ్రెస్ నేతలు  రాహుల్ కు వివరిస్తున్నారు. బోనాలు,కోలాటాలు, పోతు రాజుల  విన్యాసాలతో ఆయా ప్రాంతాల్లో కాంగ్రెస్  నేతలు రాహుల్ తో కలిసి  పాదయాత్రలు నిర్వహిస్తున్నారు.

also read:భారత్ జోడో యాత్ర : రాహుల్ పాదయాత్రలో అపశృతి, కిందపడిపోయిన గీతా రెడ్డి.. స్వల్పగాయాలు

తెలంగాణ  రాష్ట్రం నుండి మహారాష్ట్రలోకి  రాహుల్ యాత్ర ప్రవేశించనుంది.ఈ ఏడాది సెప్టెంబర్ 7నతమిళనాడులోని  కన్యాకుమరిలో  ఈ యాత్ర ప్రారంభమైంది. తమిళనాడు ,కేరళ,కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, లలో రాహుల్ గాంధీ పాదయాత్ర ముగిసింది. కన్యాకుమాారి నుండి జమ్మూ కాశ్మీర్  వరకు యాత్ర  సాగనుంది. దేశంలో 3500  కి.మీ దూరం రాహుల్  గాంధీయాత్ర సాగనుంది. 

ఎఐసీసీ  చీఫ్ గా  బాధ్యతులు స్వీకరించిన తర్వాత తొలిసారిగా   మల్లికార్జునఖర్గే హైద్రాబాద్  నగరంలోనే రాహుల్ తో  కలిసి పాదయాత్రలో పాల్గొన్నారు.భారత్  జోడో యాత్ర  ద్వారా కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో జోష్ వస్తుందని ఆ పార్టీ నేతలు  భావిస్తున్నారు.

click me!