అక్రమసంబంధాలతో అరెస్టవుతున్న పోలీసుల కేసులు దిగ్భ్రాంతిని కలిగిస్తున్నాయి. సంచలనం సృష్టించిన సీఐ నాగేశ్వరరావు ఉదంతం మరువక ముందే మరో సీఐ రాజు వివాహేతర సంబంధం కేసులో అరెస్టయ్యాడు.
హైదరాబాద్ : వనస్థలిపురం పీ ఎస్ పరిధిలో మరో సీఐ అక్రమ సంబంధం బాగోతం వెలుగు చూసింది. పెళ్లై, పిల్లలున్న సీఐ రాజు మరో మహిళతో కారులో ఏకాంతంగా ఉండగా.. అతని భార్య, పిల్లలు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. మాజీ సీఐ నాగేశ్వరరావు ఉదంతం మరువక ముందే మరో ఇన్ స్పెక్టర్ నిర్వాకం ఇలా వెలుగులోకి వచ్చింది. భార్య తనకు న్యాయం చేయాలంటూ వనస్థలిపురం పోలీస్ స్టేషన్ ఎదుట పిల్లలతో కలిసి ఆందోళనకు దిగింది.
కొద్ది కాలంగా భర్త ప్రవర్తన మీద అనుమానం వచ్చిన భార్య.. అతడిని రహస్యంగా ఫాలో అవుతోంది. అలాగే గత రాత్రి కూడా ప్రియురాలితో కారులో వెడుతున్న భర్తను పిల్లలతో సహా ఫాలో అయ్యింది. అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళతో గుర్రం గూడ సమీపంలోని చెట్లలో అర్థరాత్రి కారులో ఏకాంతంగా ఉన్న సమయంలో.. పిల్లలతో కలిసి ఫాలో చేసి వెళ్లిన భార్య... పెట్రోలింగ్ చేస్తున్న కానిస్టేబుల్స్ సహాయంతో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది.
కాగా, విషయం బయటపడడంతో సిఐ రాజు పెట్రోలింగ్ కానిస్టేబుల్స్ మీద దాడికి దిగాడు. తాను సీఐనని దబాయించాడు. రాజు హైదరాబాద్ లో సౌత్ జోన్ కంట్రోల్ రూమ్ లో ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. చెట్లలో పిల్లల అరుపులు వినిపించడంలో వనస్థలిపురం పెట్రోలింగ్ చేస్తున్న కానిస్టేబుల్స్ అక్కడికి వెళ్లగా విషయం తెలిసింది.
కానిస్టేబుల్స్ ఇన్స్పెక్టర్ ని ఇదేం పని అని అడగటంతో.. రాజు వారిమీద దాడికి దిగాడు. ఇన్స్పెక్టర్ రాజు సొంత ఊరు కందుకూరు మండలం, బేగంపేట. రాజుకి భార్య, ఒక పాప ఒక బాబు ఉన్నారు. సీఐ రాజు దాడి చేయటంతో వనస్థలిపురం కానిస్టేబుల్ రామకృష్ణ, హోం గార్డ్ నాగార్జున నాయుడులు గాయపడ్డారు. గత రాత్రి ఇన్స్పెక్టర్ రాజుని అరెస్ట్ చేసి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ కి తరలించారు. అయితే దీనికి రాజు సపోర్ట్ చేయలేదు. ఆ తరువాత 2002 బ్యాచ్ కి చెందిన రాజు అనే ఇన్స్పెక్టర్ ని అరెస్ట్ చేసినట్లు వనస్థలిపురం పోలీసులు తెలిపారు. హైదరాబాద్ కమిషనరేట్ లోని ఎస్ బీ విభాగంలో సీఐ రాజు పనిచేస్తున్నాడు. మునగోడు ఎన్నికల విధులకు హాజరై, తిరిగి వస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది.
మహిళ కిడ్నాప్, అత్యాచారం... మారేడ్‌పల్లి సీఐ నాగేశ్వరరావుపై సస్పెన్షన్ వేటు
కాగా, నవంబర్ 2న ఇలాంటి ఘటనే వెలుగుచూసింది. పెరోల్ కాగితాలు ఉన్నతాధికారులకు పంపించి.. అనుమతి తొందరగా వచ్చేలా చూడాలి.. అంటే తనకు వీడియో కాల్ చేయాలంటూ ఖైదీ సోదరిని జైలు అధికారి వేధింపులకు గురి చేసిన సంఘటన చర్లపల్లిలో వెలుగులోకి వచ్చింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ఎండి భాష అనే ఖైదీ చెర్లపల్లి కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవిస్తున్నాడు. అతడికి పెరోల్ అవకాశం లభించింది. అయితే, త్వరగా ప్రక్రియ పూర్తి కావాలంటే తనకు వీడియో కాల్ చేయాలంటూ డిప్యూటీ సూపరింటెండెంట్ దశరథం ఖైదీ సోదరికి ఫోన్ చేసి వేధించడం మొదలుపెట్టాడు.
దీని గురించి జైల్లో ఉన్న సోదరుడికి పెట్టుకుని ఆమె ఏడ్చింది. తన కుటుంబ సభ్యులను సదరు అధికారి లైంగికంగా వేధిస్తున్నాడంటూ పర్యవేక్షణాధికారి సంతోష్ రాయ్ కి గత నెల26న ఖైదీ ఫిర్యాదు చేశాడు. వేధింపులు వాస్తవమేనని విచారణ అధికారి నివేదిక అందించారు. ఈ నేపథ్యంలో శాఖాపరమైన చర్యలలో భాగంగా ఆ అధికారిని బదిలీ చేస్తున్నట్లు జైళ్లశాఖ డీజీ జితేందర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. అతడిపై జైళ్లశాఖ అధికారితో పాటు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు సమాచారం.