ఆ తర్వాతే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ గురించి మాట్లాడండి: కేటీఆర్ కు కిషన్ రెడ్డి కౌంటర్

By narsimha lodeFirst Published Mar 12, 2021, 3:32 PM IST
Highlights

నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిచిన తర్వాతే విశాఖ స్టీల్ ప్లాంట్‌పై సీఎం కేసీఆర్ కుటుంబం మాట్లాడాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి  హితవు పలికారు.. శుక్రవారం ఆయన హైద్రాబాద్ లో మీడియాతో మాట్లాడారు.

హైదరాబాద్:  నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిచిన తర్వాతే విశాఖ స్టీల్ ప్లాంట్‌పై సీఎం కేసీఆర్ కుటుంబం మాట్లాడాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి  హితవు పలికారు.. శుక్రవారం ఆయన హైద్రాబాద్ లో మీడియాతో మాట్లాడారు.

 ఏడేళ్లుగా నిజాం షుగర్ ఫ్యాక్టరీని ఎందుకు తెరవలేదో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజల్లో వ్యతిరేకతను తగ్గించుకునేందుకే బీజేపీపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికలు వచ్చినప్పుడల్లా టీఆర్ఎస్ పార్టీకి పూనకం వస్తుందన్నారు. బాధ్యతారహితంగా ప్రధాని మోదీ, కేంద్రంపై విమర్శలు చేస్తున్నారని ఆయన టీఆర్ఎస్ నేతలపై మండిపడ్డారు.

 రాష్ట్రంలో కుటుంబపాలన పట్ల తెలంగాణ ప్రజల్లో వ్యతిరేకత ఉందన్నారు. అయితే  దాని నుంచి  ప్రజల దృష్టి మళ్లించడం కోసం టీఆర్ఎస్ పార్టీ ఒక పథకం ప్రకారం కేంద్రంపై విమర్శలు చేస్తోందని ఆయన చెప్పారు.

also read:విశాఖ ఉక్కు ఉద్యమంపై ఎందుకు మాట్లాడొద్దు: బీజేపీపై కేటీఆర్ ఫైర్

కేంద్రాన్ని విమర్శించేముందు రాష్ట్ర పరిధిలో ఉన్న అనేక అంశాల్లో ప్రభుత్వం వైఫల్యం చెందిందని దానికి జవాబు చెప్పాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ సాగుతున్న ఉద్యమానికి కేటీఆర్ మద్దతు ప్రకటించారు. అవసరమైతే విశాఖకు వచ్చి తాను సంఘీభావం తెలుపుతానని కేటీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. 


 

click me!