బండి సంజయ్ దీక్షకు భయమెందుకు: టీఆర్ఎస్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్

By narsimha lodeFirst Published Jan 3, 2022, 9:17 PM IST
Highlights


బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను అరెస్ట్ చేయడంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. నిబంధనలు కేవలం విపక్షాలకే వర్తిస్తాయా అని కేంద్ర మంత్రి ప్రశ్నించారు.

న్యూఢిల్లీ:  బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దీక్షకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు భయపడుతోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు.టీఆర్ఎస్ నేతలు కరోనా నిబంధనలు పాటించని విషయం పోలీసులకు కన్పించడం లేదా అని  కేంద్ర మంత్రి  ప్రశ్నించారు.

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు Bandi Sanjay అరెస్ట్ పై సోమవారం నాడు కేంద్ర మంత్రి Kishan Reddy న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 317 జీవో తీసుకు రావడం ప్రభుత్వానిది తొందరపాటు చర్యేనని ఆయన చెప్పారు. సీఎంKcr  ఏనాడూ కూడా మాస్క్ పెట్టుకోవడం తాను చూడలేదన్నారు. నల్గొండలో మంత్రుల పర్యటనలో కూడా ఎవరూ కూడా మాస్కులు పెట్టుకోలేదన్నారు. టీఆర్ఎస్ నేతల కరోనా ఉల్లంఘనలపై కేసులు పెడితే జైళ్లు సరిపోవన్నారు. 

also read:బండి సంజయ్‌ బెయిల్ పిటిషన్ తిరస్కరణ: 14 రోజుల రిమాండ్ విధించిన కరీంనగర్ కోర్టు

టీఆర్ఎస్ సర్కార్ తీరును కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తప్పుబట్టారు. బండి సంజయ్ ను అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ప్రతిపక్షాలకే చట్టం అమలు చేస్తారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు కిషన్ రెడ్డి.  పార్టీలో చర్చించే బండి సంజయ్ జాగరణ దీక్షకు దిగినట్టుగా కిషన్ రెడ్డి తెలిపారు. పార్టీ కార్యాలయాన్ని బద్లలు కొడతారా అని ఆయన ప్రశ్నించారు. ఉద్యోగుల కోసం బీజేపీ పోరాడడం తప్పా అని ప్రశ్నించారు.తెలంగాణలో బెంగాల్ రాజకీయాలు పనికిరావన్నారు.

ఏనాడూ కూడా ధర్నా చౌక్ కు రాని సీఎం కేసీఆర్... కేంద్ర ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేసేందుకు ధర్నా నిర్వహించారన్నారు. అయితే ఇతర పార్టీలు  పార్టీ కార్యాలయాల్లో కూడా నిరసన చేసే హక్కు లేదా అని ఆయన ప్రశ్నించారు.

317 జీవోను  రద్దు చేయాలని  ఉద్యోగ సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ జీవోతో  నష్టాలే ఎక్కువగా ఉన్నాయని ఉద్యోగ సంఘాల నేతలు  చెబుతున్నారు. ఈ జీవోను నిరసిస్తూ తెలంగాణ సెక్రటేరియట్ ముట్టడికి గత వారంలో ఉపాధ్యాయ సంఘాలు ప్రయత్నించాయి. అయితే ఉపాధ్యాయ సంఘాల నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ జీవోతో 25 వేల మంది ఉపాధ్యాయులు స్థానికతను కోల్పోయారని ఉపాధ్యాయ సంఘాల నేతలు చెప్పారు.

 రాష్ట్రంలో పలు దఫాలుగా ఉపాధ్యాయ సంఘాలు ఈ జీవోను నిరసిస్తూ ఆందోళనలను కొనసాగిస్తున్నాయి. ఈ విషయమై సీఎం జోక్యం చేసకోవాలని కూడా కోరుతున్నాయి.ఉద్యోగుల డిమాండ్లకు సంబంధించి బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కరీంనగర్  బీజేపీ కార్యాలయంలో బండి సంజయ్ దీక్షకు దిగాడు. అయితే ఆదివారం నాడు రాత్రి బండి సంజయ్ దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఇవాళ ఆయనను కోర్టులో హాజరుపర్చారు. బండి సంజయ్ కి 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు.

317 జీవో విషయమై  సీఎం కేసీఆర్ జోక్యం చేసుకోవాలని ఉద్యోగ సంఘాల నేతలు కోరుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత కూడా రాష్ట్రంలో ఉద్యోగులకు న్యాయం జరగకపోతే  ప్రత్యేక రాష్ట్రం వచ్చిన ప్రయోజనం ఏమిటని ఉద్యోగ సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. 

click me!