పార్టీలో బురద సంస్కృతి మొదలైంది, సీఎం అపాయింట్‌ అడుగుతా: జగ్గారెడ్డి సంచలనం

By narsimha lodeFirst Published Jan 3, 2022, 6:23 PM IST
Highlights


టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను సీఎం కేసీఆర్ ను కలిసేందుకు అపాయింట్ మెంట్ అడుగుతానని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ బురద సంస్కృతి ఇటీవలనే ప్రారంభమైందన్నారు.


హైదరాబాద్: పార్టీలో బురద సంస్కృతి ఈ మధ్యనే ప్రారంభమైందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ Jagga Reddy విమర్శించారు.సోమవారం నాడు ఆయన Hyderabadలో మీడియాతో మాట్లాడారు. తాను కూడా సీఎంని కలవాలని అపాయింట్ మెంట్ అడుగుతున్నానని చెప్పారు. ఎవరో ఏదో అనుకొంటే తాను రాజకీయం చేయలేనన్నారు. పార్టీ అధ్యక్షుడిని కలిస్తే తప్పు కానీ, సీఎంని కలిస్తే తప్పేంటని ఆయన చెప్పారు.ప్రతిపక్ష పార్టీలు CM kcr ని కలవకూడదనేది తప్పన్నారు.  ఒక వ్యక్తి పార్టీని కబ్జా చేసే అవకాశం లేదని చెప్పారు. కానీ పార్టీకి నష్టం చేకూర్చే ప్రమాదం లేదని తెలిపారు.

also read:నన్ను నష్టపరిచి.. పార్టీని ఆక్రమించుకోవాలని ‘‘కొందరి’’ కుట్ర : భట్టి విక్రమార్క సంచలన వ్యాఖ్యలు

Congress  పార్టీలో రచ్చబండ రాజకీయం రచ్చకు కారణమైంది. ఎర్రవల్లిలో రేవంత్ రెడ్డి Rachabanda కార్యక్రమం గురించి సమాచారం ఇవ్వకపోవడంపై  జగ్గారెడ్డి తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.ఈ విషయమై ఎఐసీసీ చీఫ్ Sonia gandhi లేఖ రాశారు. Revanth Reddy ని పీసీసీ చీఫ్ పదవి నుండి తప్పించాలని ఆ లేఖలో కోరారు. అయితే ఈ లేఖ మీడియాకు లీక్ కావడంపై  కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం కమిటీ చైర్మెన్ Chinna Reddy స్పందించారు. ఈ ఫిర్యాదును తప్పు పట్టలేదు. కానీ  సోనియా గాంధీకి రాసిన లేఖ మీడియాకు విడుదల కావడంపై చిన్నారెడ్డి తప్పుబట్టారు. జగ్గారెడ్డి తీరు క్రమశిక్షణను ఉల్లంఘించడమే అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ  కమిటీ ముందుకు జగ్గారెడ్డిని పిలుస్తామని ఆయన చెప్పారు. అయితే Revanth Reddyని క్రమశిక్షణ కమిటీ వద్దకు ముందుగా పిలవాలని జగ్గారెడ్డి కోరారు.

రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరును జగ్గారెడ్డి బహిరంగంగానే పలుమార్లు తీవ్రంగా వ్యతిరేకించారు.గతంలో ఉమ్మడి మెదక్ జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమం గురించి కూడా తమకు సమాచారం  ఇవ్వకపోవడంపై కూడా జగ్గారెడ్డి రేవంత్ రెడ్డి తీరుపై మండిపడ్డారు.

మీడియా వేదికగానే  జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరును జగ్గారెడ్డి బహిరంగంగానే పలుమార్లు తీవ్రంగా వ్యతిరేకించారు.గతంలో ఉమ్మడి మెదక్ జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమం గురించి కూడా తమకు సమాచారం  ఇవ్వకపోవడంపై కూడా జగ్గారెడ్డి రేవంత్ రెడ్డి తీరుపై మండిపడ్డారు. మీడియా వేదికగానే  జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి తన వ్యక్తిగత ఇమేజ్ ను కాపాడుకొనేందుకే ప్రయత్నిస్తూ పార్టీకి నష్టం చేకూరేలా వ్యవహరిస్తున్నారని జగ్గారెడ్డి విమర్శిస్తున్నారు. పార్టీలో కొందరు సీనియర్లు కూడా రేవంత్ రెడ్డి తీరుపై  ఆగ్రహంతో ఉన్నారు. 

అవకాశం వచ్చినప్పుడల్లా  రేవంత్ రెడ్డి తీరుపై సీనియర్లు  పార్టీ అధినాయకత్వానికి ఫిర్యాదులు చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశంలో చర్చించకుండానే రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా నిర్ణయాలు తీసుకొంటూ కార్యక్రమాలను నిర్వహించడంపై కూడా పార్టీ సీనియర్లు కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.ఇదే విషయమై గతంలో పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ మాణికం ఠాగూర్ కు ఫిర్యాదు చేశారు కొందరు పార్టీ సీనియర్లు. అయితే భవిష్యత్తులో ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ ఠాగూర్ పార్టీ నేతలకు సూచించారు.

click me!