కష్టాల్లో కిషన్ రెడ్డి సోదరుడిలా అండగా నిలిచాడు: మందకృష్ణ మాదిగ

By Siva KodatiFirst Published Sep 5, 2021, 2:25 PM IST
Highlights

కష్టాల్లో ఉన్నప్పుడు సోదరుడిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తనకు ఎంతో అండగా నిలిచారని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎంఆర్‌పీఎస్) వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. ఎన్నో సందర్భాల్లో తన బాధ్యతను తీసుకున్నారని గుర్తు చేశారు. ఎస్సీ వర్గీకరణ పెండింగ్ లో ఉన్నప్పటికీ ఇద్దరి మధ్యా మంచి బంధమే ఉందని చెప్పారు

ఇటీవల బాత్రూంలో జారిపడి చికిత్స పొందిన మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎంఆర్‌పీఎస్) వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆదివారం పరామర్శించారు. ఆయన ఆరోగ్యం గురించి వాకబు చేశారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. సామాజిక న్యాయం కోసం మంద కృష్ణ పోరాడుతున్నారని, ఎస్సీ వర్గీకరణ కోసం అలుపెరగని పోరాటం చేస్తున్నాని కిషన్ రెడ్డి కొనియాడారు. లక్ష్య సాధనలో ఇలాగే ముందుకెళ్లాలని ఆకాంక్షించారు.

కాగా, కష్టాల్లో ఉన్నప్పుడు సోదరుడిగా కిషన్ రెడ్డి తనకు ఎంతో అండగా నిలిచారని మంద కృష్ణ అన్నారు. ఎన్నో సందర్భాల్లో తన బాధ్యతను తీసుకున్నారని గుర్తు చేశారు. ఎస్సీ వర్గీకరణ పెండింగ్ లో ఉన్నప్పటికీ ఇద్దరి మధ్యా మంచి బంధమే ఉందని చెప్పారు. ఎస్సీ వర్గీకరణ కోసం అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్తామని రెండేళ్ల క్రితం అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటించారని గుర్తు చేసిన ఆయన.. ఇప్పటికైనా ఆ పని చేయాలని చురకలంటించారు. రెండేళ్లలోనే దళితబంధు పథకాన్ని రాష్ట్రమంతటా అమలు చేయాలని మందకృష్ణ డిమాండ్ చేశారు
 

click me!