హీరా గోల్డ్ స్కాం: నౌహీరా షేక్‌‌కు సుప్రీంలో ఊరట

Published : Sep 05, 2021, 01:36 PM IST
హీరా గోల్డ్ స్కాం: నౌహీరా షేక్‌‌కు సుప్రీంలో ఊరట

సారాంశం

హీరా గోల్డ్ స్కాం కేసులో నౌహీరా షేక్ కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆమె కంపెనీకి చెందిన డేటాను ఉపయోగించుకొనేందుకు సుప్రీంకోర్టు అనుమతి లభించింది. నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్ లోని డేటాను పోలీసులు మరో హార్డ్ డిస్క్ లో నౌహీరా షేక్ కు పోలీసులు అందించారు.

హైదరాబాద్: హీరా గోల్డ్ స్కాం కేసుకు సంబంధించి ఆ సంస్థ ఛైర్మెన్ నౌహీరా షేక్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. తమ సంస్థ డేటాను ఉపయోగించుకొనేందుకు నౌహీరా షేక్ కు ఈ విషయమై ఉన్నత న్యాయస్థానం అనుమతిచ్చింది.నౌహీరా షేక్ ను అరెస్ట్ చేసిన సమయంలో  ఆ సంస్థకు చెందిన డేటాను నాంపల్లిలోని ఫోరెన్సిక్ ల్యాబ్ లో పోలీసులు తరలించారు. 

అయితే ఈ డేటా కోసం నౌహీరా షేక్ కోర్టును ఆశ్రయించింది. ఈ డేటాను ఉపయోగించుకొనేందుకు పోలీసులు అంగీకరించారు. ఈ డేటా వివరాలను మరో హార్డ్ డిస్క్ లో కాపీ చేసి నౌహీరా షేక్ కు పోలీసులు అందించారు.డిపాజిటర్లను మోసం చేసిన కేసులో  నౌహీరా షేక్ ను 2018 అక్టోబర్ 17న హైద్రాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. 15 కంపెనీలకు నౌహీరా షేక్ ఛైర్మెన్ గా కొనసాగుతున్నారు. వేర్వేరు పేర్లతో ఈ కంపెనీలు నడిపారు.


 

PREV
click me!

Recommended Stories

School Holidays : ఈ గురువారం స్కూళ్ళకు సెలవేనా..? ఎందుకో తెలుసా?
Air Pollution : హైదరాబాద్ మరో డిల్లీ అవుతోందా..! ఈ ప్రాంతాల్లో మరీ ఇంత కాలుష్యమా..!!