దళిత బంధును బిజెపి ఆహ్వానిస్తోంది...: హుజురాబాద్ లో కేంద్ర సహాయ మంత్రి సంచలనం

By Arun Kumar PFirst Published Sep 5, 2021, 1:09 PM IST
Highlights

తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన దళిత బంధు పథకాన్ని బిజెపి ఆహ్వానిస్తోందని... ఇదే మాదిరిగా గౌడ బంధు కూడా అమలు చేయాలని కేంద్ర సహాయ మంత్రి మురళీధరన్ డిమాండ్ చేశారు. 

కరీంనగర్: తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన దళిత బంధు పథకాన్ని బిజెపి ఆహ్వానిస్తోందని పార్లమెంట్, విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి మురళీధరన్ గౌడ్ అన్నారు. అయితే దళితుల్లోనే కాదు మిగతా కులాల్లో కూడా నిరుపేదలు ఉన్నారు... వారి పరిస్థితి ఏంటి? అని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు. గౌడ కులంలో కూడా చాలామంది పేదలు ఉన్నారు... ఎందుకు ''గౌడ బంధు'' పథకం ఇవ్వడం లేదు? అని కేంద్ర మంత్రి నిలదీశారు. 

హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలోని కమలాపూర్ లో బిజెపి నిర్వహిస్తున్న గౌడ గర్జనలో ముఖ్య అతిథిగా కేంద్ర సహాయ మంత్రి మురళీధరన్ పాల్గొననున్నారు. ఇందుకోసం హుజురాబాద్ కు చేరుకున్న ఆయన మాజీ మంత్రి ఈటల రాజేందర్, మాజి ఎంపి జితేందర్ రెడ్డితో కలిసి మధువని గార్డెన్ లో మీడియా మాట్లాడారు. 

కేంద్ర మంత్రి మురళీధరన్ మాట్లాడుతూ... చాలా రోజుల తరువాత తెలంగాణకు వచ్చానన్నారు. తెలంగాణ వస్తే మంచి జరుగుతుందని చాలా మంది ఆశలు పెట్టుకున్నారు... కానీ గత ఏడు సంవత్సరాల నుండి రాష్ట్రంలో అనుకున్న అభివృద్ది జరుగలేదన్నారు. ముఖ్యమంత్రి కేసీఅర్ తెలంగాణకు ఇచ్చిన హామీలేవీ నెరవేర్చలేదని... దళితున్ని ముఖ్యమంత్రి చేస్తానన్న ఆయన హామీ ఏమయ్యిందని కేంద్ర మంత్రి ప్రశ్నించారు.

READ MORE   huzurabad by election: పార్టీల ఆశలపై నీళ్లు.. ఇప్పట్లో హుజురాబాద్ ఉపఎన్నిక లేనట్లే, ఈసీ సంచలనం

''ఎన్నికలు వస్తేనే కేసీఅర్ కు తెలంగాణ ప్రజలు గుర్తు వస్తారు. ఎంఐఎం భయంతోనే కేసీఅర్ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడం లేదు. అంతేకాదు భారత ప్రభుత్వం తెలంగాణకు కోట్ల నిధులు మంజూరు చేసిన కేసీఅర్ ప్రభుత్వం సరిగ్గా వినియోగించుకోవడం లేదు. కాళేశ్వరం ప్రాజెక్ట్ వల్ల కేవలం కేసీఅర్ కుటుంబానికి లాభం జరిగింది'' అని ఆరోపించారు. 

''ప్రధాన మంత్రి అవాస్ యోజన కింద ఇప్పటి వరకు తెలంగాణలో పేదలకు ఇల్లు కట్టలేదు. తెలంగాణ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమయ్యింది. కాంగ్రెస్ వల్లే గత ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం లోకి వచ్చింది. అనంతరం జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి తెలంగాణ లో నాలుగు సీట్లు గెలుపొందింది. తెలంగాణ రాష్ట్రం లో ప్రజలు మార్పు కోరుకుంటున్నారు.రాబోయే ఉప ఎన్నికల్లో హుజురాబాద్ లో బిజెపి విజయం సాదించబోతుంది'' అని మురళీధరన్ స్పష్టం చేశారు.

 
 

click me!