Hyderabad: అత్తింటివారిపై సొంత అల్లుడే విషప్రయోగం చేశాడు. తినే ఆహారంలో విషం కలిపి వారి ప్రాణాలు తీయడానికి కుట్ర చేశాడు. ఈ విష ప్రయోగం కారణంగా కుటుంబంలోని ఒకరు ప్రాణాలు కోల్పోగా, మిగతా వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
Poisoning-Family: అత్తింటివారిపై సొంత అల్లుడే విషప్రయోగం చేశాడు. వారు తినే ఆహారంలో విషం కలిపి ప్రాణాలు తీయడానికి కుట్ర చేశాడు. ఈ విషప్రయోగం కారణంగా కుటుంబంలోని ఒకరు ప్రాణాలు కోల్పోగా, మిగతా వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ దారుణ ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది.
వివరాల్లోకెళ్తే.. సొంత అల్లుడే అత్తింటి కుటుంబంపై విషప్రయోగానికి పాల్పడిన షాకింగ్ ఘటన నగరంలోని మియాపూర్‌లో చోటుచేసుకుంది. ఈ ఘటనలో కుటుంబంలోని ఒకరు ప్రాణాలు కోల్పోయారు. మిగతా వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు నిలుపుకోవడానికి పోరాడుతున్నారు. పోలీసులు లోతైన దర్యాప్తులో ఈ దారుణం కుట్ర వెలుగులోకి వచ్చింది. అత్తింటివారిని అంతం చేయాలనే దురుద్దేశంతోనే బాధిత కుటుంబానికి చెందిన అల్లుడు ముప్పవరపు అజిత్ వారిపై విష ప్రయోగం చేశాడని పోలీసులు తమ దర్యాప్తులో గుర్తించారు.
అత్తింటి వారిని పూర్తిగా అంతం చేయలనే దురుద్దేశంతో అల్లుడు ముప్పవరపు అజిత్ ఈ విషప్రయోగ కుట్రకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. ముందుకు తాను అనుకున్న పథకం ప్రకారం తినే ఆహారంలో విషం కలిపాడు. దీని గురించి తెలియక పోవడంతో విషంతో కూడిన ఆహారాన్ని తిన్న బాధితుల అనారోగ్యానికి గురయ్యారు. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. అక్కడ వీరు తిన్న ఆహారంలో విషం కలిసిందనీ, దీని కారణంగా అనారోగ్యానికి గురయ్యారని వైద్యులు వెల్లడించారు.
కేసు నమోదుచేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. పోలీసులు లోతైన విచారణ జరపగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ప్రధాన నిందితుడు ముప్పవరపు అజిత్ కుమార్ పరారీలో ఉండగా, ఈ కేసులో ఇప్పటికి ఆరుగురిని అరెస్టు చేశారు.