ధాన్యం కొనుగోలు చేసేది లేదని కేంద్రం చెప్పినట్టు నిరూపించాలి: కేసీఆర్ కు కిషన్ రెడ్డి సవాల్

By narsimha lode  |  First Published Nov 29, 2021, 4:40 PM IST

వరి ధాన్యం కొనుగోలు విషయంలో  కేసీఆర్ వైఖరిపై  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. ధాన్యం కొనుగోలు చేయబోమని ఎప్పుడూ చెప్పిందో రుజువు చేయాలని ఆయన కేసీఆర్ కు సవాల్ విసిరారు.


న్యూఢిల్లీ: ధాన్యం కొనుగోలు చేసేది లేదని కేంద్రం ఎప్పుడూ ఎలా చెప్పిందో నిరూపించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ  సీఎం కేసీఆర్ కు సవాల్ విసిరారు. ధాన్యం విషయంలో  లేని సమస్యను పట్టుకొని సీఎం కేసీఆర్ ఆందోళన చేస్తున్నారన్నారు.  సోమవారం నాడు  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి  న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. Kcr అనుసరించిన మొండి విధానాల వల్లే  Farmers   తీవ్రంగా నష్టపోతున్నారని ఆయన విమర్శించారు. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అమలు చేస్తున్న విధానాన్నే Telangana రాష్ట్రంలోనూ తాము అవలంభిస్తున్నామని  కేంద్ర మంత్రి తెలిపారు. గతంలో ప్రభుత్వాలు మే మాసంలోనే పంటల ప్రణాళికలను విడుదల చేసేవని ఆయన గుర్తు చేశారు.  కానీ కేసీఆర్ సర్కార్ కు వ్యవసాయం విషయంలో ప్రణాళిక లేదని Kishan Reddy  విమర్శించారు.

ఒకసారి పత్తి పంట వేయవద్దని,మరోసారి వరి వేయవద్దని రైతులను ప్రభుత్వం కోరిన విషయాన్ని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు.  వ్యవసాయంపై సీఎం కేసీఆర్ కు స్థిరమైన అభిప్రాయం లేదన్నారు. Huzurabad bypoll లో ఓటమి తర్వాత కేసీఆర్ కు నిద్ర పట్టని పరిస్థితి నెలకొందని ఆయన విమర్శించారు. బాయిల్డ్ రైస్ విషయంలో గత నాలుగేళ్లుగా కేంద్రం  హెచ్చరిస్తూనే ఉన్నా రాష్ట్రం పట్టీపట్టనట్టుగా వ్యవహరించిందన్నారు. కొత్త వంగడాలు ఇచ్చి రైతులను రా రైస్ దిశగా రాష్ట్ర ప్రభుత్వం మళ్లించాలని ఆయన  సూచించారు.  రాష్ట్రంలో రైతుల నుండి చివరి బస్తా వరకు కొనుగోలు చేసేందుకు  కేంద్రం సిద్దంగా ఉందని ఆయన హమీ ఇచ్చారు.

Latest Videos

undefined

also read:TRS MPs protest: తెలంగాణ రైతులపై కేంద్రం వివక్ష చూపుతోందన్న టీఆర్‌ఎస్ ఎంపీలు.. పార్లమెంట్‌లో నిరసన

 ధాన్యం కొనుగోలు విషయమై కేంద్రం నుండి స్పష్టత కోరుతూ తెలంగాణ సీఎం  కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు.ఈ విషయమై కేంద్రం నుండి స్పష్టత రాలేదని తాడో పేడో తేల్చుకొంటామని కేసీఆర్ ఢిల్లీకి వెళ్లాడు. అయితే  కేసీఆర్ ప్రధానిని కలవలేదు.  ప్రధాని అపాయింట్ మెంట్ ను కేసీఆర్ కోరలేదని కాంగ్రెస్ విమర్శలు చేసింది. యాసంగిలో వరి ధాన్యం కొనుగోలు చేయాలని  కేంద్రంపై రాష్ట్రం ఒత్తిడి తెస్తోంది. అయితే బాయిల్డ్ రైస్ ను కొనుగోలు చేయబోమని కేంద్రం స్పష్టం చేసింది. రా రైస్ ను  కొనుగోలు చేస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. వర్షాకాలం వరి ధాన్యం కొనుగోలు విషయమై రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ విమర్శలు చేస్తోంది. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు ధాన్యం వచ్చినా కూడా  రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేయడం లేదని బీజేపీ విమర్శలు చేస్తోంది. 
ధాన్యం కొనుగోలు కేంద్రాలకు బీజేపీ నేతలు  వెళ్లారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ వెళ్లిన సమయంలో టీఆర్ఎస్ శ్రేణులు నిరసనకు దిగాయి. బండి సంజయ్ కాన్వాయ్ పై రాళ్ల దాడికి దిగారు.  బీజేపీ, టీఆర్ఎస్ శ్రేణుల మధ్య ఘర్షణలు చోటు చేసుకొన్నాయి. పార్లమెంట్ లో టీఆర్ఎస్ నిరసనకు దిగింది. పంజాబ్ రాష్ట్రం నుండి కొనుగోలు చేస్తున్నట్టుగానే తెలంగాణ నుండి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు. పార్లమెంట్ ఆవరణలోని  గాంధీ విగ్రహం ముందు ఆందోళనకు దిగారు. 


 

click me!