Hyderabad: సీఎం కేసీఆర్ నాయకత్వంలోని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)పై తీవ్ర విమర్శలు గుప్పించిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. భారతీయ జనతా పార్టీకి బీఆర్ఎస్ 'బీటీమ్' అని ఆరోపిస్తూ..దానిని 'బీజేపీ రిష్తేదార్ సమితి' అని పేర్కొన్నారు. కేసీఆర్ రిమోట్ కంట్రోల్ మోడీ చేతిలో వుందనీ, బీజేపీ-బీఆర్ఎస్ ఒక్కటేననే వ్యాఖ్యలు చేశారు.
BJP, BRS slam Rahul Gandhi: కేసీఆర్ రిమోట్ కంట్రోల్ మోడీ చేతిలో వుందంటూ కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ, బీఆర్ఎస్ లు తీవ్రంగా మండిపడుతున్నాయి. ఈ క్రమంలోనే బీజేపీ నాయకుడు, కేంద్ర మంత్రి జీ.కిషన్ రెడ్డి స్పందిస్తూ.. కర్నాటక ఎన్నికల తర్వాత కాంగ్రెస్ అతి చేస్తోందని అన్నారు. వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తుపెట్టుకోబోమని అన్నారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై మండిపడ్డారు.
వివరాల్లోకెళ్తే.. తెలంగాణలోని ఖమ్మంలో కాంగ్రెస్ జనగర్జన పేరుతో భారీ బహిరంగ సభను నిర్వహించింది. లక్షలాది మంది ప్రజలు హాజరైన ఈ సభా వేదికగా కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ప్రసంగించారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలోని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)పై తీవ్ర విమర్శలు గుప్పించిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. భారతీయ జనతా పార్టీకి బీఆర్ఎస్ 'బీటీమ్' అని ఆరోపిస్తూ..దానిని 'బీజేపీ రిష్తేదార్ సమితి' అని పేర్కొన్నారు. కేసీఆర్ రిమోట్ కంట్రోల్ మోడీ చేతిలో వుందనీ, బీజేపీ-బీఆర్ఎస్ ఒక్కటేననే వ్యాఖ్యలు చేశారు. అయితే, రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్, బీజేపీలు ఫైర్ అవుతున్నాయి. కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. "మోడీ కేసీఆర్ రిమోట్ కంట్రోల్" అంటూ కాంగ్రెస్ అధినేత రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి జీ కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కర్నాటకలో ఎన్నికల విజయం తర్వాత ఆ పార్టీ అతి మించిపోయిందన్నారు.
Latest Videos
తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీఆర్‌ఎస్‌తో గానీ, కాంగ్రెస్‌తో గానీ బీజేపీ పొత్తు పెట్టుకోదు. తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్‌ఎస్‌తో రాజీపడి ఎన్నికల్లో పోటీ చేసింది. బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోం. కర్నాటకలో ఒక్క ఎన్నికల్లో గెలిచినందుకే రాహుల్ గాంధీ అతిగా మాట్లాడుతున్నారు : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
అలాగే, ఖమ్మంలో రాహుల్ గాంధీ చేసిన ప్రసంగంలో చేసిన ఆరోపణలను బీఆర్ఎస్ నేతలు కొట్టిపారేశారు. ఆయన వ్యాఖ్యలు నిరాధారమని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ అన్నారు. ఖమ్మం సభలో రాహుల్ గాంధీ చేసిన ప్రసంగం అబద్ధాల మూట అనీ, తెలంగాణలో కాంగ్రెస్ కార్యకర్తలు తయారు చేసిన స్క్రిప్ట్ ఆధారంగానే ఆయన నిరాధార ఆరోపణలు చేశారన్నారు. ఇది చాలా దురదృష్టకరమని శ్రవణ్ అన్నారు. కాగా, ఈ ఏడాది చివర్లో తెలంగాణలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఓటర్లను ఆకట్టుకునేందుకు కాంగ్రెస్ విశ్వప్రయత్నాలు చేస్తోంది. అలాగే, బీజేపీ, అధికార బీఆర్ఎస్ లు సైతం ఎన్నికల్లో గెలుపు మాదేనంటూ ధీమాతో ముందుకు సాగుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలోని వివిధ పార్టీ నాయకల మధ్య కొనసాగుతున్న మాటల యుద్ధంతో తెలంగాణ పాలిటిక్స్ హీటెక్కాయి.