
మునుగోడు ఉపఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ అధికార దుర్వినియోగం చేస్తోందని ఆరోపించింది బీజేపీ. బుధవారం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసిన కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ ఫిర్యాదు చేశారు. టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తోందని ఆయన ఆరోపించారు. మునుగోడు ఎన్నికల్లో నకిలీ నోట్లను తొలగించాలని కేంద్ర ఎన్నికల కమీషన్ దృష్టికి ప్రదాన్ తీసుకెళ్లారు. ఇప్పటికే 12 వేల నకిలీ ఓట్లను తొలగించారని, మరో 14 వేల ఓట్లు తొలగించాల్సి వుందని చెప్పారు. అలాగే మునుగోడు ఎన్నికలో డబ్బు, మద్యం విచ్చలవిడిగా పంపిణీ చేస్తున్నారని ... ప్రభుత్వ వాహనాలను కూడా ఇష్టానుసారంగా ఉపయోగిస్తున్నారని ఫిర్యాదు చేశారు ధర్మేంద్ర ప్రదాన్. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.