హైద్రాబాద్ లో ఇంజనీరింగ్ థర్ఢ్ ఇయర్ విద్యార్ధిని సూసైడ్

Published : Oct 26, 2022, 05:07 PM ISTUpdated : Oct 26, 2022, 05:09 PM IST
హైద్రాబాద్ లో ఇంజనీరింగ్ థర్ఢ్ ఇయర్  విద్యార్ధిని  సూసైడ్

సారాంశం

మేడ్చల్  జిల్లా పేట్ బషీరాబాద్‌లో  ఇంజనీరింగ్  థర్డ్ఇయర్ చదివే  విద్యార్ధిని శ్రావణి  ఆత్మహత్య  చేసుకుంది.  ఈ ఘనటకు  సంబంధించి  పోలీసులు  కేసు నమోదు చేసుకుని దర్యాప్తు  చేస్తున్నారు.  


హైదరాబాద్: మేడ్చల్  జిల్లా  పేట్  బషీరాబాద్  లో ఇంజనీరింగ్ మూడో  తరగతి  చదువుతున్న  విద్యార్ధిని శ్రావణి  బుధవారం నాడుఆత్మహత్య  చేసుకుంది.హస్టల్ గదిలో శ్రావణి సూసైడ్  చేసుకుంది. మల్లారెడ్డి  ఇంజనీరింగ్ కాలేజీలో  శ్రావణి  ఇంజనీరింగ్  చదువుతుంది.మల్లారెడ్డి కాలేజీలో  శ్రావణి  సీఎస్ఈ థర్డ్ ఇయర్  చదువుతుంది. ఆమె ఆత్మహత్యకు  గల  కారణాలపై పోలీసులు  ఆరా తీస్తున్నారు.  శ్రావణి ఆత్మహత్య  చేసుకున్న హస్టల్ గదిని పోలీసులు పరిశీలించారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో  ప్రతి రోజూ పలు  ఆత్మహత్యల కేసులు నమోదయ్యాయి.ఆర్ధిక ఇబ్బందులు,  కుటుంబ కలహల నేపథ్యంలో ఆత్మహత్యలు చేసుకొంటున్నారు.విశాఖపట్టణంలో ఇటీవలనే భార్యాభర్తలకు కౌన్సిలింగ్ నిర్వహిస్తున్న సమయంలోనే  భార్య పోలీస్ స్టేషన్ ముందే  పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య  చేసుకుంది. ఈ నెల 20వ  ఈ ఘటన చోటుచేసుకుంది. పెళ్లి చేసుకున్న నాలుగు మాసాల తర్వాత వివాహిత ఆత్మహత్య చేసుకుంది.

ఈ నెల 19న విశాఖపట్టణంలోని లాడ్జీలో ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. ప్రేమ  జంట  లాడ్జీలో కిటీకి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు.హైద్రాబాద్ చందానగర్ లో ఒకే కుటుంబానికి  చెందిన  నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు.ఈ నెల 17న  ఈ ఘటన చోటు చేసుకుంది.మరోవైపు లోన్ యాప్  సంస్థల వేధింపులు భరించలేక  పలువురు ఆత్మహత్యలకు  పాల్పడిన  ఘటనలు కూడ  రెండు తెలుగు రాష్ట్రాల్లో  నమోదయ్యాయి.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Hyderabad IT Jobs : మీరు సాప్ట్ వేర్ జాబ్స్ కోసం ప్రయత్నిస్తున్నారా..? కాగ్నిజెంట్ లో సూపర్ ఛాన్స్, ట్రై చేయండి
ఇప్పుడే కొనేయండి.. హైద‌రాబాద్‌కు దూరంగా అభివృద్ధికి ద‌గ్గ‌ర‌గా.. ఈ గ్రామం మ‌రో గ‌చ్చిబౌలి కావ‌డం ఖాయం.