యాదాద్రి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం.. కెమికల్ ఫ్యాక్టరీలో చెలరేగిన మంటలు..

Published : Oct 26, 2022, 04:42 PM ISTUpdated : Oct 26, 2022, 04:58 PM IST
యాదాద్రి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం.. కెమికల్ ఫ్యాక్టరీలో చెలరేగిన మంటలు..

సారాంశం

తెలంగాణలోని యాదాద్రి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. చందక్ లేబొరేటరీస్‌లో బుధవారం మంటలు చెలరేగాయి.

తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. జిల్లాలోని బీబీనగర్ మండల పరిధిలోని చందక్ లేబొరేటరీస్‌లో బుధవారం మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంపై సమాచరాం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. అయితే ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు కూడా ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. అయితే అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. 

ఈ ఘటనపై బీబీనగర్ పోలీసులు మాట్లాడుతూ.. ‘‘చందక్ ల్యాబొరేటరీస్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. వెంటనే రెండు అగ్నిమాపక వాహనాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశాయి. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు’’అని  చెప్పారు. 

PREV
click me!

Recommended Stories

Hyderabad IT Jobs : మీరు సాప్ట్ వేర్ జాబ్స్ కోసం ప్రయత్నిస్తున్నారా..? కాగ్నిజెంట్ లో సూపర్ ఛాన్స్, ట్రై చేయండి
ఇప్పుడే కొనేయండి.. హైద‌రాబాద్‌కు దూరంగా అభివృద్ధికి ద‌గ్గ‌ర‌గా.. ఈ గ్రామం మ‌రో గ‌చ్చిబౌలి కావ‌డం ఖాయం.