కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఖమ్మం పట్టణానికి చేరుకున్నారు. ఖమ్మం చేరుకున్న అమిత్ షాకు ఆ పార్టీ నేతలు ఘనంగా స్వాగతం పలికారు.
ఖమ్మం: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆదివారం నాడు మధ్యాహ్నం ఖమ్మం చేరుకున్నారు. గన్నవరం ఎయిర్ పోర్టుకు ప్రత్యేక విమానంలో అమిత్ షా వచ్చారు. గన్నవరం ఎయిర్ పోర్టు నుండి ప్రత్యేక హెలికాప్టర్ లో ఖమ్మం పట్టణానికి చేరుకున్నారు ఖమ్మంలో రైతు గోస-బీజేపీ భరోసా సభ సభలో అమిత్ షా పాల్గొంటారు. ఖమ్మం చేరుకున్న మంత్రి అమిత్ షాకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్, బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జీ తరుణ్ చుగ్ తదితరులు అమిత్ షాకు ఘనంగా స్వాగతం పలికారు. ఖమ్మం చేరుకున్న హోంశాఖ మంత్రి అమిత్ షా ఎన్ఎస్‌పీ అతిథిగృహానికి చేరుకున్నారు. అక్కడి నుండి బీజేపీ బహిరంగ సభలో పాల్గొన్నారు.
గతంలో కూడ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఖమ్మం టూర్ వాయిదా పడింది. ఉత్తరాదిలో భారీ వర్షాల నేపథ్యంలో అమిత్ షా టూర్ వాయిదా పడింది. అయితే తెలంగాణపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది బీజేపీ నాయకత్వం. వీలు దొరికితే బీజేపీ అగ్రనేతలు తెలంగాణలో పర్యటించేలా ఆ పార్టీ జాతీయ నాయకత్వం ప్లాన్ చేస్తుంది. ఈ క్రమంలోనే ఇవాళ అమిత్ షా టూర్ ఏర్పాటు చేశారు.
దక్షిణాదిలోని తెలంగాణపై బీజేపీ నాయకత్వం ఫోకస్ పెంచింది. గత పార్లమెంట్ ఎన్నికల నుండి తెలంగాణలో బీజేపీకి పాజిటివ్ స్పందన వచ్చింది. దీంతో తెలంగాణపై బీజేపీ కేంద్ర నాయకత్వం మరింత దృష్టి పెట్టింది.