భాగ్యలక్ష్మి ఆలయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రత్యేక పూజలు

By narsimha lodeFirst Published Nov 29, 2020, 12:28 PM IST
Highlights

నగరంలోని పాతబస్తీలోని భాగ్యలక్ష్మి ఆలయంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆదివారం నాడు ప్రత్యేక పూజలు నిర్వహించారు.


హైదరాబాద్: నగరంలోని పాతబస్తీలోని భాగ్యలక్ష్మి ఆలయంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆదివారం నాడు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఇవాళ ఉదయం బేగంపేట ఎయిర్ పోర్టు నుండి అమిత్ షా నేరుగా పాతబస్తీలోని భాగ్యలక్ష్మి ఆలయానికి చేరుకొన్నారు. కేంద్ర హోంశాఖ మంత్రితో పాటు ఎమ్మెల్యే రాజాసింగ్, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, మాజీ ఎమ్మెల్యేలు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, లక్ష్మణ్ తదితరులు అమిత్ షా వెంట ఉన్నారు.

 

హైదరాబాద్ చేరుకున్నాను.

తెలంగాణ ప్రజల ఆప్యాయతకు మరియు మద్దతుకు ముగ్దుడనైయ్యాను.

Reached Hyderabad!

Grateful to the people of Telangana for this warmth and support. pic.twitter.com/uRF0VIzENo

— Amit Shah (@AmitShah)

ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత అమిత్ షా ఆలయం వద్ద ఉన్న బీజేపీ కార్యకర్తలకు రెండు చేతులెత్తి అభివాదం చేశారు. 

also read:జీహెచ్ఎంసీ ఎన్నికలు: హైద్రాబాద్‌కు చేరుకొన్న అమిత్ షా

అమిత్ షా భాగ్యలక్ష్మి ఆలయంలో పూజలు నిర్వహించేందుకు వస్తున్నందున చార్మినార్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. భాగ్యలక్ష్మి ఆలయం నుండి అమిత్ షా నగరంలోని పలు ప్రాంతాల్లో రోడ్ షోలలో పాల్గొంటారు. 

జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా  అమిత్ షా వారాసీగూడ నుండి సీతాఫల్ మండి వరకు రోడ్ షోలలో పాాల్గొంటారు. నగరంలోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కేంద్ర మంత్రి రోడ్ షోలలో పాల్గొంటారు. 

హైద్రాబాద్ టూర్ కు సంబంధించి మంత్రి అమిత్ షా ట్విట్టర్ వేదికగా తెలుగులో స్పందించారు. హైద్రాబాద్ కు చేరుకొన్నాను..తెలంగాణ ప్రజల ఆప్యాాయతకు తాను ముగ్దుడైనట్టుగా ఆయన చెప్పారు.

click me!