మంత్రి పేర్నినానిపై మేస్త్రీ దాడి: సురక్షితంగా బయటపడిన మినిష్టర్ (వీడియో)

Published : Nov 29, 2020, 12:19 PM ISTUpdated : Nov 29, 2020, 02:02 PM IST
మంత్రి పేర్నినానిపై మేస్త్రీ దాడి: సురక్షితంగా బయటపడిన మినిష్టర్ (వీడియో)

సారాంశం

ఏపీ రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పేర్నినానిపై ఓ వ్యక్తి దాడి చేశాడు.ఈ దాడి నుండి మంత్రి తృటిలో తప్పించుకొన్నాడు. ఆదివారం నాడు మంత్రి నివాసంలోనే ఈ ఘటన చోటు చేసుకొంది.

మచిలీపట్టణం: ఏపీ రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పేర్నినానిపై ఓ వ్యక్తి దాడి చేశాడు.ఈ దాడి నుండి మంత్రి తృటిలో తప్పించుకొన్నాడు. ఆదివారం నాడు మంత్రి నివాసంలోనే ఈ ఘటన చోటు చేసుకొంది.

మంత్రి నివాసానికి చేరుకొన్న  నాగేశ్వరరావు అనే వ్యక్తి తాపీతో మంత్రిపై దాడికి ప్రయత్నించాడు.ఈ దాడి నుండి మంత్రి తప్పించుకొన్నాడు. ఈ దాడిలో మంత్రికి ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోలేదు. అక్కడే ఉన్న మంత్రి అనుచరులు దుండగుడిని పట్టుకొన్నారు. 

వీడియో

వెంటనే మంత్రి అనుచరులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ సమాచారం ఆధారంగా పోలీసులు మంత్రి ఇంటికి చేరుకొని నిందితుడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.మంత్రిపై నాగేశ్వరరావు ఎందుకు దాడికి దిగాడనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు.

మద్యం మత్తులో  నాగేశ్వరరావు మంత్రిపై రెండు సార్లు దాడికి ప్రయత్నించారు. గతంలో తాను రెండుసార్లు నాగేశ్వరరావును చూసినట్టుగా చెప్పారు.  తన తల్లి పెద్ద కర్మ సందర్భంగా చాలా మంది వచ్చినట్టుగా మంత్రి తెలిపారు.తన కాళ్లపై పడేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా నటించి నాగేశ్వరరావు తనపై రెండుసార్లు దాడికి ప్రయత్నించారని మంత్రి చెప్పారు.
 

PREV
click me!

Recommended Stories

Hyderabad: ఇక‌పై గోవా వెళ్లాల్సిన ప‌నిలేదు.. హైద‌రాబాద్‌లో 35 ఎకరాల్లో, రూ. 350 కోట్లతో అద్భుత నిర్మాణం
Hyderabad Vegetable Price : ఈ వీకెండ్ మార్కెట్స్ లో కూరగాయల ధరలు ఎలా ఉంటాయంటే..