పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు

Published : Jan 25, 2019, 02:28 PM IST
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు  పర్యావరణ అనుమతులు

సారాంశం

పాలమూరు-రంగారెడ్డి  ప్రాజెక్టుల్లో కీలకమైన పరిణామం చోటు చేసుకొంది. ఈ ప్రాజెక్టుకు పర్యావరణ, అటవీశాఖ రెండో దశ అనుమతులను మంజూరు చేసింది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి ఇక ఎలాంటి ఇబ్బందులు ఉండవని  నీటి పారుదల శాఖాధికారులు చెబుతున్నారు

హైదరాబాద్:  పాలమూరు-రంగారెడ్డి  ప్రాజెక్టుల్లో కీలకమైన పరిణామం చోటు చేసుకొంది. ఈ ప్రాజెక్టుకు పర్యావరణ, అటవీశాఖ రెండో దశ అనుమతులను మంజూరు చేసింది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి ఇక ఎలాంటి ఇబ్బందులు ఉండవని  నీటి పారుదల శాఖాధికారులు చెబుతున్నారు.  మరో వైపు ఈ ప్రాజెక్టుకు అనుమతులు మంజూరు చేయడం పట్ల సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు.

పాలమూరు- రంగారెడ్డి   ప్రాజెక్టు పనులను ఇక యుద్ద ప్రాతిపదికన చేపట్లాలని  తెలంగణ సర్కార్ భావిస్తోంది. ఈ మేరకు ప్రాజెక్టుకు అవసరమైన పర్యావరణ, అటవీ శాఖ అనుమతుల కోసం కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.

కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అనుమతులను మంజూరు చేస్తున్నట్టు  కేంద్ర ప్రభుత్వం నుండి  శుక్రవారం నాడు  తెలంగాణ రాష్ట్రానికి  సమాచారం అందింది. ఈ మేరకు కేంద్ర అటవీ డిప్యూటీ ఇన్స్‌పెక్టర్ జనరల్  శ్రావణ్ కుమార్  రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు.

పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేయడం పట్ల  సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టుకు అనుమతిలిచ్చినందుకు కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌కు సీఎం ధన్యవాదాలు తెలిపారు. ప్రాజెక్టుకు అనుమతులు వచ్చేలా  కృషి చేసిన  సాగు నీటి పారుదల ప్రాజెక్టు అధికారులు,  అటవీశాఖాధికారులను కేసీఆర్ అభినందించారు.

 

 

PREV
click me!

Recommended Stories

Pawan Kalyan మీద దేశద్రోహం కేసు పెట్టాలి: Kalvakuntla Kavitha | Asianet News Telugu
Revanth Reddy emotional: కొడంగల్‌లో ఓడిపోయా.. నాపని అయిపోయిందని.. | Asianet News Telugu