పాపపై అత్యాచారయత్నం చేసిన ఆటోడ్రైవర్ ఇతనే (ఫోటో)

sivanagaprasad kodati |  
Published : Jan 25, 2019, 01:56 PM IST
పాపపై అత్యాచారయత్నం చేసిన ఆటోడ్రైవర్ ఇతనే (ఫోటో)

సారాంశం

హైదరాబాద్ దుండిగల్‌లో దారుణం జరిగింది.. కన్నబిడ్డ వయసున్న ఓ రెండేళ్ల చిన్నారిపై మొయినుద్దీన్ అనే ఆటోడ్రైవర్ అత్యాచారం చేశాడు. గురువారం రాత్రి ఇంటి వద్ద ఆడుకుంటున్న బాలికను అపహరించిన మొయినుద్దీన్ ఆమెను నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతానికి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు

హైదరాబాద్ దుండిగల్‌లో దారుణం జరిగింది.. కన్నబిడ్డ వయసున్న ఓ రెండేళ్ల చిన్నారిపై మొయినుద్దీన్ అనే ఆటోడ్రైవర్ అత్యాచారం చేశాడు. గురువారం రాత్రి ఇంటి వద్ద ఆడుకుంటున్న బాలికను అపహరించిన మొయినుద్దీన్ ఆమెను నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతానికి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు.

పాప అరుపులు, కేకలు పెట్టడంతో వెంటనే గమనించిన స్థానికులు అక్కడికి పరుగులు తీశారు. నిందితుడు మొయినుద్దీన్‌ను పట్టుకుని చితకబాదారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు చిన్నారిని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. 
 

PREV
click me!

Recommended Stories

School Holidays : నెక్ట్స్ వీక్ లో వరుసగా రెండ్రోజులు సెలవులు ఖాయం.. మరో రెండ్రోజులు కూడానా?
IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!