ఎస్‌సీ వర్గీకరణపై కేంద్ర ప్రభుత్వం వేగంగా పావులు కదుపుతుంది. గత ఏడాది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కేంద్రం ఈ దిశగా అడుగులు వేస్తుంది.
న్యూఢిల్లీ: ఎస్‌సీ వర్గీకరణపై కేంద్ర ప్రభుత్వం ఐదుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. ఎస్సీ వర్గీకరణపై కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా నేతృత్వంలో కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీలో కేంద్ర హోంశాఖ, న్యాయశాఖ, గిరిజన, సామాజిక, న్యాయ శాఖల కార్యదర్శులు సభ్యులుగా ఉంటారు. ఈ నెల 22న ఈ కమిటీ తొలి సమావేశం జరగనుంది. 2023 నవంబర్ లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎస్సీ వర్గీకరణపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ విషయమై హామీ ఇచ్చారు.
also read:ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు: బల్మూరి వెంకట్, మహేష్ కుమార్ గౌడ్ ఏకగ్రీవ ఎన్నిక లాంఛనమే
ఎస్‌సీ వర్గీకరణ విషయమై మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించిన విషయం తెలిసిందే . అయితే ఈ విషయమై సుప్రీంకోర్టులో కూడ పలు పిటిషన్లు దాఖలయ్యాయి.అయితే ఈ పిటిషన్ల విషయమై రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటుకు సుప్రీంకోర్టు కూడ అంగీకరించిన విషయం తెలిసిందే.
also read:ప్రపంచంలోనే అతి ఎత్తైన బీ.ఆర్. అంబేద్కర్ విగ్రహం: జాతికి అంకితం చేయనున్న జగన్
2023 నవంబర్ 11న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హైద్రాబాద్ కు వచ్చారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన అణగారిన వర్గాల విశ్వరూప సభలో ఆయన పాల్గొన్నారు. ఎస్ సీ వర్గీకరణ విషయమై ప్రధానమంత్రి మోడీ తమ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ హమీ మేరకు కమిటీని ఏర్పాటు చేయాలని మోడీ అధికారులను ఆదేశించారు.ఈ ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల్లో తమకు అన్యాయం జరుగుతుందని ఎంఆర్‌పీఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. అంతేకాదు రాజకీయ పార్టీలు టిక్కెట్ల కేటాయింపులో కూడ తమకు తక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని కూడ ఎంఆర్‌పీఎస్ ఆరోపించింది. ఈ విషయమై ఆందోళనలు నిర్వహించింది. అయితే 2004 నవంబర్ 5 న సుప్రీంకోర్టు ఎస్ సీ వర్గీకరణ చట్టాన్ని సాంకేతిక కారణాలతో రద్దు చేసిన విషయం తెలిసిందే.
ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల నాటికి ఈ విషయమై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. గత ఏడాది సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన సభలో మోడీ ఇచ్చిన హామీ విషయమై ఎంఆర్‌పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ భావోద్వేగానికి గురైన విషయం తెలిసిందే.