తెలంగాణకు గిరిజన యూనివర్శిటీ, జాతీయ పసుపుబోర్డు: కేంద్రకేబినెట్ కీలక నిర్ణయాలు

By narsimha lode  |  First Published Oct 4, 2023, 4:23 PM IST

ములుగులో గిరిజన యూనివర్శిటీ, జాతీయ పసుపు బోర్డు ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. 
 


న్యూఢిల్లీ: ములుగులో గిరిజన యూనివర్శిటీ, జాతీయ పసుపు బోర్డు  ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. బుధవారం నాడు కేంద్ర కేబినెట్ సమావేశం  బుధవారం నాడు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన న్యూఢిల్లీలో జరిగింది. తెలంగాణకు చెందిన మూడు అంశాలకు  కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.  కేంద్ర కేబినెట్ సమావేశం వివరాలను  కేంద్ర మంత్రులు అనురాగ్ ఠాకూర్, కిషన్ రెడ్డి మీడియాకు వివరించారు. నిజామాబాద్ లో పసుపు బోర్డును ఏర్పాటు చేయనున్నట్టుగా కేంద్ర మంత్రి చెప్పారు. ములుగులో ఏర్పాటు చేసే గిరిజన యూనివర్శిటీకి సమ్మక్క సారక్క అని నామకరణం చేయనున్నారు. ములుగులో  గిరిజన యూనివర్శిటీని ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని  కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ చెప్పారు.  రూ. 900 కోట్లతో  సమ్మక్క సారక్క యూనివర్శిటీని ఏర్పాటు చేయనున్నట్టు కేంద్రం తెలిపింది. మరో వైపు రూ. 8 వేల కోట్ల విలువైన కోట్ల పసుపు ఎగుమతులే లక్ష్యంగా  బోర్డు ఏర్పాటు కానుందని కేంద్రం తెలిపింది. 

also read:ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణా జలాల పంపిణీకి కేంద్రం ఆదేశం:కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు

Latest Videos

undefined

ఈ నెల 1వ తేదీన మహబూబ్ నగర్ లో నిర్వహించిన సభలో  ఈ రెండు అంశాలకు సంబంధించి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ  ప్రకటన చేశారు.  పాలమూరు ప్రజా గర్జన సభలో ఈ విషయాన్ని ప్రధాని మోడీ ప్రకటించారు. ఈ సభ జరిగిన మూడు రోజులకే కేబినెట్ ఈ విషయాలకు ఆమోదం తెలిపింది. మరో వైపు ఏపీ , తెలంగాణ రాష్ట్రాల మధ్య ఉన్న కృష్ణా జలాల అంశాలపై కేబినెట్ చర్చించింది.ఈ రెండు రాష్ట్రాల మధ్య  నీటి పంపిణీ చేయాలని కేబినెట్ ఆదేశించిందని మంత్రులు మీడియాకు తెలిపారు.  

ప్రతి రెండేళ్లకు ములుగు నియోజకవర్గంలోని మేడారంలో సమ్మక్క సారక్క జాతర సాగుతుంది.ఈ జాతరకు లక్షల మంది భక్తులు హాజరౌతారు.  ఈ ప్రాంతంలో  గిరిజన యూనివర్శిటీని ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. 

click me!