CM’s Breakfast Scheme: అక్టోబర్ 6న ప్రభుత్వ పాఠశాలల్లో 'అల్పాహార పథకా'న్ని ప్రారంభించనున్న సీఎం కేసీఆర్

By Mahesh Rajamoni  |  First Published Oct 4, 2023, 3:25 PM IST

Hyderabad: అక్టోబర్ 6న ప్రభుత్వ పాఠశాలల్లో సీఎం అల్పాహార పథకాన్ని తెలంగాణ ముఖ్య‌మంత్రి కే.. చంద్ర‌శేఖ‌ర్ రావు (కేసీఆర్) ప్రారంభించనున్నారు. చిన్నారుల కోసం ప్రత్యేక అల్పాహార పథకాన్ని ముఖ్యమంత్రి రంగారెడ్డి జిల్లాలో లాంఛనంగా ప్రారంభించనుండగా, అదే సమయంలో తెలంగాణలోని ఇతర జిల్లాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు.


CM Breakfast Scheme: అక్టోబర్ 6న ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహార పథకాన్ని తెలంగాణ ముఖ్య‌మంత్రి కే.. చంద్ర‌శేఖ‌ర్ రావు (కేసీఆర్) ప్రారంభించనున్నారు. చిన్నారుల కోసం ప్రత్యేక అల్పాహార పథకాన్ని ముఖ్యమంత్రి రంగారెడ్డి జిల్లాలో లాంఛనంగా ప్రారంభించనుండగా, అదే సమయంలో తెలంగాణలోని ఇతర జిల్లాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు.

వివ‌రాల్లోకెళ్తే.. బాలల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ మరో ప్రధాన కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతిష్టాత్మకమైన 'సీఎం అల్పాహార పథకాన్ని' ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు (కేసీఆర్) శుక్రవారం, అక్టోబర్ 6న ప్రారంభించనున్నారు. రంగారెడ్డి జిల్లాలో ముఖ్యమంత్రి లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ ప‌థ‌కం పిల్లలకు ప్రత్యేకమైన అల్పాహారం అందించేందుకు ప్ర‌భుత్వం తీసుకువ‌స్తోంది. అదే సమయంలో తెలంగాణలోని ఇతర జిల్లాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు ఈ పథకాన్ని ప్రారంభిస్తార‌ని ప్ర‌భుత్వ వ‌ర్గాలు తెలిపాయి.

Latest Videos

undefined

తెలంగాణలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో మంగళవారం జరిగిన సీఎం అల్పాహార పథకం సన్నద్ధతపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ప్రభుత్వ పాఠశాలల్లో అక్టోబర్ 6న అల్పాహార పథకాన్ని సజావుగా ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులను ఆదేశించారు. "ముఖ్యమంత్రి ఆదేశాల ఆధారంగా, ప్ర‌స్తుతం కొనసాగుతున్న మధ్యాహ్న భోజన పథకంతో పాటు, అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో సీఎం అల్పాహార పథకం ప్రారంభించబడుతుంది" అని సీఎస్ చెప్పారు. తెలంగాణలోని అన్ని జిల్లాల్లోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక ప్రభుత్వ పాఠశాలను అల్పాహార పథకం ప్రారంభానికి గుర్తించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. అల్పాహార పథకం ప్రారంభించే సమయంలో స్థానిక ప్రజాప్రతినిధులు చురుగ్గా పాల్గొనేలా తగు ఏర్పాట్లు చేపట్టాలని సీఎస్ అధికారులకు సూచించారు. 

పట్టణ కేంద్రాల్లో, అల్పాహార పథకాన్ని అక్షయ పాత్ర ఫౌండేషన్ అమలు చేస్తుంది, గ్రామీణ ప్రాంతాల్లో ఈ పథకాన్ని స్వయం సహాయక సంఘాలు తీసుకుంటాయి. అక్టోబరు 14లోగా బతుకమ్మ చీరల పంపిణీ, అక్టోబర్ 18లోగా స్పోర్ట్స్ కిట్ల పంపిణీ ప్రక్రియను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించారు. కాగా, తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో (1 నుంచి 10వ తరగతి వరకు) విద్యార్థులకు అల్పాహార పథకం అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం దాదాపు రూ. 400 కోట్లు ఖర్చు చేయనుంది.

click me!