ఘంటా చక్రపాణి కసురుకుంటుండు

First Published Aug 21, 2017, 6:11 PM IST
Highlights
  • వినతిపత్రం ఇస్తే కసురుకుంటున్నారు
  • పొంతన లేని సమాధానాలు చెబుతున్నారు
  • ఎఫ్ ఆర్ ఓ వయో పరిమితి పెంచకపోతే ఆందోళన
  •  

టిఎస్పిఎస్సీ ఛైర్మన్ నిరుద్యోగులను కసురుకుంటున్నాడని నిరుద్యోగ జెఎపి ఛైర్మన్ కోటూరి మానవత్ రాయ్ ఆరోపించారు. ఎఫ్.ఆర్.ఓ పోస్టుల వయోపరిమితి విషయంలో నిరుద్యోగులు TSPSC ఛైర్మన్‌ ఘంటా చక్రపాణిని కల్సి వినతిపత్రం సమర్పించగా ఘంటా చక్రపాణి కసురుకుంటున్నారని ఆరోపించారు. అంతేకాకుండా FRO సివిల్ సర్వీసు IFS స్థాయి తో సమానం అంటూ పొంతనలేని సమాధానం ఇచ్చాడని తెలిపారు. నిరుద్యోగులను కసురుకుంటూ తప్పించుకునే ప్రయత్నం చేయడం తమను మోసం చేయడమేనని అన్నారు కోటూరి.

తక్షణమే ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్( FRO) ఉద్యోగాల వయోపరిమితి 28ఏళ్ళ నుండి 32ఏళ్ళకు పెంచాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో 2011నోటిఫికేషన్ లో 30ఏళ్ళు గ ఉన్న వయోపరిమితి  తెలంగాణలో 28ఏళ్ళకు కుదించటం అన్యాయం అని పేర్కొన్నారు. దీనిపై తక్షణమే సర్కారు స్పందించకపోతే ఆందళనకు దిగుతామని హెచ్చరించారు. 2011లో వచ్చిన ఫారెస్ట్  నోటిఫికేషన్ ని మా బిడ్డలకు మేము ఉద్యోగాలు ఇస్తాం! అని, ఉద్యమ సమయంలో కెసిఆర్ నోటిఫికేషన్లు ఆపేశారని ఆరోపించారు. తీరా  అధికారం లోకి వచ్చిన తర్వాత, సిఎం గా కెసిఆర్ నోటిఫికేషన్ ను తీవ్రజాప్యం చేశారన్నారు.

వయోపరిమితి పెంచాల్సింది పోయి తగ్గించడం దిక్కుమాలిన చర్య అని విమర్శించారు. నిరుద్యోగులను ముంచాలని చూస్తే నిరుద్యోగ జెఏసి చూస్తూ ఊరుకోదని కోటూరి హెచ్చరించారు. వాస్తవంగా UPSCనిర్వహించే IFS పోస్టుకు వయోపరిమితి 32ఏళ్ళు ఉందన్న సంగతి తెలియని వ్యక్తులు ఛైర్మన్ లుగా మెంబర్లుగా కోనసాగటం అనైతికం అని మానవతా రాయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

 

మరిన్ని తాజా వార్తల కోసం  ఇక్కడి క్లిక్ చేయండి

 

click me!