
నేరెళ్ల బాధితుల విషయంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న సిరిసిల్ల ఎస్పీ విశ్వజిత్ కంపాటి ని ఎట్టకేలకు తెలంగాణ సర్కారు కదిలించింది. ఆయనను బాధ్యతల నుంచి తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది. కరీంనగర్ సిపికి సిరిసిల్ల ఎస్పీ బాధ్యతలను అప్పగించింది. విశ్వజిత్ నెలరోజుల లాంగ్ లీవ్ పై వెళ్తున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. నేరెళ్ల దళితుల పై థర్డ్ డిగ్రీ ప్రయోగించడంలో ఎస్పీ ప్రమేయం ఉందని విపక్షాలు గత రెండు నెలలుగా తీవ్రమైన ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎస్సై రవీందర్ ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది.
భారత్ చైనా బోర్డర్లో పోలీసు సంస్మరణ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు విశ్వజిత్ ను లడఖ్ పంపుతున్నది ప్రభుత్వం. 25 రోజుల పాటు లడఖ్ పర్యటన ఉంటుందని చెబుతున్నారు.
సిరిసిల్ల sp కి నెరేళ్ల ఘటనతో సంబంధం ఉందంటూ విపక్షాల ఆందోళనల నేపథ్యంలో విశ్వజిత్ ను sp బాధ్యతల నుంచి తప్పించడం ప్రాధాన్యతను సంతరించుకున్నది.