భూమిలో రూ.40కోట్లు... కొత్తగూడెంలో కలకలం

Published : Nov 19, 2018, 10:47 AM IST
భూమిలో రూ.40కోట్లు... కొత్తగూడెంలో కలకలం

సారాంశం

టీఆర్ఎస్ నేత తన కారు షెడ్డుకి సమీపంలో భూమిలో రూ.40కోట్లు పాతిపెట్టారంటూ.. కొత్తగూడెంలో వార్త కలకలం రేపింది.

ఓ టీఆర్ఎస్ నేత తన కారు షెడ్డుకి సమీపంలో భూమిలో రూ.40కోట్లు పాతిపెట్టారంటూ.. కొత్తగూడెంలో వార్త కలకలం రేపింది. ఈ మేరకు గుర్తుతెలియని వ్యక్తులు ఆదివారం  జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి రజత్ కుమార్ కి సమాచారం అందించారు.

వారి సమాచారం మేరకు అప్రమత్తమైన  ఆయన.. ఇతర అధికారులకు సమాచారం అందించారు. కొత్తగూడెం నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి, ఆర్డీవో స్వర్ణలత అక్కడి వెళ్లి పరిశీలించారు. ఆ తర్వాత ప్లయింగ్‌ స్క్వాడ్‌, ఎస్‌ఎ్‌సటీ బృందాలను అక్కడికి వెళ్లి.. పరిశీలించాలని ఆదేశించారు. వారు సాయంత్రానికి ఎక్సకవేటర్‌తో ఫిర్యాదులో పేర్కొన్న ప్రాంతానికి వెళ్లి 6 నుంచి 7గంటల దాకా తవ్వకాలు జరిపారు. 

అయితే.. అక్కడ రూ.40కోట్లు కాదు కదా.. రూ.40కూడా దొరకకపోవడం గమనార్హం. కావాలనే కలెక్టర్ కి తప్పుడు సమాచారం అందించారన్న విషయం అర్థమైంది. కాగా.. తప్పుడు సమాచారం అందించిన వారిపై చర్యలు తీసుకుంటామని ఎన్నికల అధికారులు ఈ సందర్భంగా తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

Sydney Bondi Beach ఉగ్రదాడి: నిందితుడు సాజిద్ అక్రమ్‌కు హైదరాబాద్ లింకులు.. భారత పాస్‌పోర్ట్‌తో షాకింగ్ !
Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?