కన్నీరుపెట్టుకున్న ఎర్రబెల్లి

Published : Nov 19, 2018, 10:00 AM IST
కన్నీరుపెట్టుకున్న ఎర్రబెల్లి

సారాంశం

 తూర్పు నియోజకవర్గ ప్రజలను కంటికిరెప్పలా కాపాడుకుంటున్నానన్నారు.  

టీఆర్ఎస్ నేత, వరంగల్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ ఛైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్ రావు.. స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి దిగుతానని ప్రకటించారు. వరంగల్‌ తూర్పు ప్రజల ఎజెండానే నా ఎజెండా అని, ప్రజలు, అభిమానులు, కార్యకర్తల కోరిక మేరకు వరంగల్‌ తూర్పు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలుస్తున్నట్లు ఆయన ప్రకటించారు.

హంటర్‌రోడ్‌లోని ఆయన కార్యాలయంలో వరంగల్‌ తూర్పు నియోజకర్గ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రదీప్‌రావు భావోద్వేగానికి గురై ఒక దశలో కంటతడిపెట్టారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ... తూర్పు నియోజకవర్గ ప్రజలను కంటికిరెప్పలా కాపాడుకుంటున్నానన్నారు.

తూర్పు ప్రజలు అభ్యర్థిని, వారి చరిత్రను, చిత్తశుద్ధితో పని చేసే వ్యక్తిని, ప్రజాసమస్యలపై అవగాహన ఉన్న వ్యక్తిని ఎమ్మెల్యేగా ఎన్నుకోవాలన్నారు. తనను ఆశీర్వదిస్తే తూర్పు నియోజకవర్గాన్ని అభివృద్ధిచేస్తానన్నారు. ప్రజల కష్టసుఖాల్లో పాలు పంచుకుంటానన్నారు. కొన్నేళ్లుగా వరంగల్‌ తూర్పు ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానన్నారు. అందరి కోరిక మేరకే 19నతూర్పు నియోజకవర్గం నుంచి నామినేషన్‌ వేస్తున్నట్లు తెలిపారు.

PREV
click me!

Recommended Stories

Invite KCR To Medaram Jatara: కేసీఆర్ కు మేడారం ఆహ్వాన పత్రిక అందజేసిన మంత్రులు| Asianet News Telugu
Real estate: హైద‌రాబాద్‌లోని ఈ శివారు ప్రాంతం మ‌రో కూక‌ట్‌ప‌ల్లి కావ‌డం ఖాయం.. ఇప్పుడే కొనేయండి