యుకె లో 63 రకాల పూలతో  కెసిఆర్ జన్మదిన వేడుకలు

Published : Feb 17, 2017, 12:50 PM ISTUpdated : Mar 25, 2018, 11:40 PM IST
యుకె లో 63 రకాల పూలతో  కెసిఆర్ జన్మదిన వేడుకలు

సారాంశం

ఇంగ్లండులో 63 రకాల పూలతో  కెసిఆర్ జన్మదిన వేడుకలు 

ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు జన్నదినాన్ని ఇంగ్లండు  ఎన్ ఆర్ ఐ టిఆర్ ఎస్ శాఖ సభ్యులు వినూత్న రీతిలో జరుపుకున్నారు.

 

63వ జన్మదినం పురష్కరించుకుని వివిధప్రాంతాలనుంచి సేకరించిన 63 రకాల పూలతో వెస్ట్ లండన్ లోని ప్రసిద్ధ దుర్గా దేవి అమ్మ వారి దేవాలయం లో కార్యవర్గ  సభ్యులు కుటుంబ సమేతంగా కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు

 

కెసిఆర్ గారు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని,  ఆయన ఆ  బంగారు తెలంగాణా నిర్మాణం నిరాటంకంగా సాగాలని  వారు  ఈ పూజలు నిర్వహించారు.  యుకె అలయాలలో ఇలా అమ్మవారికి  ఒకేసారి 63 రకాల పూలతో పూజ చేయడం ఇదే మొదటి సారి.

పూజ అనంతరం  ఏర్పాటు చేసిన వేడుకల్లో, కేక్ కట్ చేసి కెసిఆర్ గారికి, తెలంగాణా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.  ఎన్నో సంవత్సరాలుగా లండన్ లో కెసిఆర్ గారి పుట్టినరోజు వేడుకలు జరుపుతున్నామని, కానీ ఈ సంవత్సరం ప్రత్యేక పూజలు చేసి వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని నిర్వాహకులు తెలిపారు. ఎన్నారై టి.ఆర్.యస్ అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం, భార్య  ప్రభలత  కూర్మాచలం సంప్రదాయబద్దంగా కార్యక్రమాన్ని ముందుండి నిర్వహించారు. 

 

లండన్ లో  వేడుకలే కాకుండా ప్రతి సంవత్సరం తెలంగాణ రాష్ట్రం లో పలు సేవా కార్యక్రమాలు చేస్తామని, ఈ సంవత్సరం కూడా వరంగల్ లో "రక్త దాన శిబిరం" ఏర్పాటు చేశామని కార్యదర్శి సృజన రెడ్డి చాడ తెలిపారు. 

 

చివరిగా లండన్ ఇంచార్జ్ సతీష్ రెడ్డి మాట్లాడుతూ తామంతా  తెలంగాణ ఏర్పాటులో కెసిఆర్ తో ఉన్నామని, ముందు బంగారు తెలంగాణా ఏర్పాటులో కూడా ఆయన వెంటే ఉంటామని అన్నారు.  

 

ఈ వేడుకల్లో ఎన్నారై టి.ఆర్.యస్ సెల్  రెడ్డి ,మీడియా ఇంచార్జ్ శ్రీకాంత్ జెల్ల ,యూకే & ఈయూ ఇంచార్జ్ విక్రమ్ రెడ్డి,IT సెక్రటరీ వినయ్ ఆకుల , లండన్ ఇంచార్జ్ సతీష్ రెడ్డి బండ ,ఈస్ట్ లండన్ కో ఆర్డినేటర్ రమేష్ యెసంపల్లి ,నవీన్ మాదిరెడ్డి , ఈవెంట్స్  కో ఆర్డినేటర్స్ రవి ప్రదీప్,వెస్ట్ లండన్ ఇంచార్జ్ గణేష్ పాస్తం,సురేష్ బుడగం ,  మెంబర్ షిప్ ఇంచార్జ్ రాకేష్ రెడ్డి కీసర  మరియు ముఖ్య సభ్యులు రవి కుమార్ రత్తినేని,అశోక్ కుమార్ అంతగిరి  మరియు టాక్ అధ్యక్షురాలు పవిత్ర కంది, టాక్ సభ్యులు స్వాతి బుడగం, మట్టా రెడ్డి, శ్రీనివాస్ యాదవ్ మేకల తదితరులు హాజరైన వారిలో వున్నారు .

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : తెలంగాణలో వర్షాలు ... ఎప్పట్నుంచో తెలుసా?
KCR Press Meet from Telangana Bhavan: చంద్రబాబు పై కేసీఆర్ సెటైర్లు | Asianet News Telugu