పార్టీ పేరేమిటో..!

First Published Feb 17, 2017, 12:13 PM IST
Highlights

అసరమైతే రాజకీయ పార్టీ పెడుతామంటున్న ప్రొ.కోదండరాం

తెలంగాణ పునర్ నిర్మాణానికి రాజకీయ జేఏసీ ఉండాల్సిందేనని గతంలో స్పష్టం చేసిన టీ జాక్ చైర్మన్ కోదండరాం  రాష్ట్ర ఏర్పాటు తర్వాత కూడా ఉద్యమరీతిలోనే జేఏసీని ముందుకు తీసుకెళ్తున్నారు. ప్రభుత్వ లోపాలను ఎండగడుతూ జేఏసీని మరింత పటిష్ట చేస్తున్నారు.

 

నిజం చెప్పాలంటే రెండున్నరేళ్ల టీఆర్ఎస్ పాలనలోని వైఫల్యాలను ఎండగట్టడంలో ప్రతిపక్షాల కంటే జేఏసీనే చాలా ముందుంది.

 

దీంతో టీ జేఏసీ త్వరలో రాజకీయ పార్టీగా రూపాంతరం చెందుతుందని ఊహాగానాలొచ్చాయి. గతంలో ఈ వార్తలు వచ్చినప్పుడు టీ జాక్ చైర్మన్ కోదండరాం వాటిని ఖండించారు.

 

ఇప్పుడు మాత్రం అవే  వార్తలు వస్తుంటే కాస్త భిన్నంగా స్పందిస్తున్నారు. గతంలో ఓ టీవీ ఇంటర్య్వూలో రాజకీయ పార్టీ ఏర్పాటు ప్రస్తావన వచ్చినప్పుడు అలాంటి అభిప్రాయం మొగ్గ దశలో ఉందని ఓ హింట్ ఇచ్చారు.

 

కాగా, ఈ రోజు హైదరాబాద్ లో ఏర్పటు చేసిన మీట్‌ ది ప్రెస్‌ కార్యక్రమంలో పార్టీ ఏర్పాటుపై కాస్త స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు.

 

సందర్భం, అవసరం వస్తే తప్పకుండా తాము రాజకీయ పార్టీ పెడతామని ప్రకటించారు. విలువలతో కూడిన రాజకీయ పార్టీల అవసరం నేటి సమాజానికి చాలా అవసరమని తెలిపారు.

 

అయితే ఒక వేళ తాము రాజకీయ పార్టీ ఏర్పాటు చేసినా జేఏసీ ఇప్పటిలాగే కొనసాగుతుందన్నారు.

 

ఇలా జేఏసీ రాజకీయ పార్టీ గా రూపాంతరం చెందుతుందనే సంకేతాలు రావడంతో కాంగ్రెస్ కూడా ఇటీవల అప్రమత్తమైంది. టీఆర్ఎస్ పాలన అనంతరం కోదండరాం వెంటే నడిచిన తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ఆయనను  ఓ పార్టీ నేతగానే చూస్తున్నాయి.

 

అందుకే టీ జేఏసీ ఆద్వర్యంలో ఈ నెల 22 న నిర్వహించే నిరుద్యోగుల ర్యాలీకి మద్దతు ఇవ్వడం పై  కాంగ్రెస్ పార్టీ నేతలు మల్లగుల్లాలు పడుతోంది.

click me!