
యూకే ఎంపీ వీరేంద్ర శర్మ నేతృత్వంలోని పార్లమెంటరీ బృందం రేపు తెలంగాణలో పర్యటించనుంది. ఉదయం 10.50 గంటలకు అసెంబ్లీకి పార్లమెంటేరియన్ బృందం చేరుకుంటుంది. స్పీకర్, డిప్యూటీ స్పీకర్, మండలి ఛైర్మన్, డిప్యూటీ ఛైర్మన్‌తోపాటు పలువురు ప్రతిపక్ష నాయకులను కలుసుకుంటుంది. ప్రభుత్వాధికారులు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయతోపాటు పలు పథకాలను యూకే బృందానికి వివరిస్తారు. వీరికి నగరంలోని ఓ స్టార్ హోటల్ లో బస ఏర్పాటు చేశారు