రోడ్డు ప్రమాదం: పుట్టిన రోజు వేడుకలకు వెళ్లి వస్తూ అనంతలోకాలకు...

Published : Jan 18, 2021, 08:29 AM ISTUpdated : Jan 18, 2021, 08:30 AM IST
రోడ్డు ప్రమాదం: పుట్టిన రోజు వేడుకలకు వెళ్లి వస్తూ అనంతలోకాలకు...

సారాంశం

మిత్రుడి పుట్టిన రోజు వేడుకలకు వెళ్లి తిరిగి వస్తూ ఇద్దరు యువకులు రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డారు. ఈ సంఘటన తెలంగాణలోని వేములవాడ సమీపంలో సోమవారం తెల్లవారుజామున జరిగింది.

వేములవాడ: ఉమ్మడి కరీంనగర్ జిల్లా వేములవాడలో విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. వేములవాడ నంది కమాను వద్ద సోమవారం తెల్లవారు జామున రోడ్డు ప్రమాదం సంభవించింది. 

బోయినపల్లి మండలం వరదవెల్లిలో మిత్రుడి పుట్టిన రోజు వేడుకలకు వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో ప్రమాదం సంభవించింది. ద్విచక్రవాహనంపై సిరిసిల్ల వైపు వెళ్తున్న యువకులు ఆగి ఉన్న బొగ్గు లారీని ఢీకొట్టారు. దాంతో ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు. 

ఇరువురు యువకులు కూడా అక్కడికక్కడే మరణించారు. మృతులను తంగెల్లపల్లి మండలం అంకుషాపూర్ గ్రామానికి చెందినవారిగా గుర్తించారు. కోరపు అజిత్ కుమార్, పెంటల వెంకటేష్ లుగా వారిని గుర్తించారు. మృతదేహాలను సిరిసిల్ల ఏరియా ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

PREV
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌లో మరో KPHB కాలనీ.. ప్రతీ ఒక్కరి సొంతింటి కల నిజం చేసేలా, ఎక్కడో తెలుసా?
GCC: హైద‌రాబాద్ ముఖ చిత్రాన్ని మార్చేస్తున్న గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు.. అస‌లేంటీవి? వీటితో జ‌రిగేదేంటీ