పల్లె నుంచి పట్నానికి: బెజవాడ- హైదరాబాద్ హైవేపై ట్రాఫిక్ జాం

By Siva KodatiFirst Published Jan 17, 2021, 8:35 PM IST
Highlights

సంక్రాంతి పండుగ సెలవులు ముగియడంతో నగరానికి తిరుగు ప్రయాణమయ్యారు జనం. ఏపీ నుంచి హైదరాబాద్‌కు పెద్ద సంఖ్యలో తిరిగి వస్తున్నారు.     దాంతో సూర్యాపేట జిల్లా పంతంగి టోల్‌ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది

సంక్రాంతి పండుగ సెలవులు ముగియడంతో నగరానికి తిరుగు ప్రయాణమయ్యారు జనం. ఏపీ నుంచి హైదరాబాద్‌కు పెద్ద సంఖ్యలో తిరిగి వస్తున్నారు. దాంతో సూర్యాపేట జిల్లా పంతంగి టోల్‌ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది.

ఇటు కొర్లపాటు టోల్‌గేట్ దగ్గర పది కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. రద్దీని తగ్గించేందుకు తాత్కాలిక చెక్‌పోస్ట్ పెట్టారు పోలీసులు, హైదరాబాద్ వైపు ఏడు గేట్లను ఓపెన్ చేసి.. వాహనాలను క్లియర్ చేస్తున్నారు ట్రాఫిక్, టోల్ సిబ్బంది. అయినా కూడా భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది.

అయితే ఇప్పటి వరకు 87 శాతం వాహనాలు ఫాస్ట్ టాగ్ చేయించుకున్నాయని…. ఇంకా 13 శాతం వాహనదారులు చేయించుకోవాల్సి ఉందని… టోల్ ప్లాజా అధికారులు తెలుపుతున్నారు. అటు ట్రాఫిక్ జాం కావటంతో టోల్ ప్లాజా సిబ్బందిపై మండిపడుతున్నారు వాహనదారులు.

మరోవైపు నేడు అత్యధికులు హైదరాబాద్ కు వచ్చేందుకు నిర్ణయించుకోవడంతో దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడిపిస్తోంది. ఈ రోజు సాయంత్రం నర్సాపూర్, విశాఖపట్నం, తిరుపతి పట్టణాల నుంచి స్పెషల్ రైళ్లు హైదరాబాద్ కు నడిపించనుంది.

ఇక ప్రైవేటు ట్రావెల్స్ లో సైతం ప్రయాణాలకు డిమాండ్ అధికంగా ఉంది. ప్రైవేటు ట్రావెల్స్ యాజమాన్యాలు టికెట్ల ధరను అధికంగా వసూలు చేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

click me!