సీరియల్ నటుడు రవికృష్ణ పేరిట ఫేస్ బుక్ ఖాతా.. యువతికి గాలం వేసి..

By telugu news teamFirst Published Feb 9, 2021, 8:06 AM IST
Highlights

ఆమె వద్ద నుంచి ఫోటోలు తీసుకొని.. ఆ తర్వాత వాటిని చూపించి బ్లాక్ మొయిల్ చేయడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో యువతి దగ్గర నుంచి లక్షల్లో డబ్బు గుంజాడు

ప్రముఖుల పేర్లు చెప్పి.. సాధారణ ప్రజలను మోసం చేసేవారి జాబితా రోజు రోజుకీ పెరిగిపోతోంది. తాజాగా ఇలాంటి సంఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. సీరియల్ నటుడు రవి కృష్ణ పేరు చెప్పి.. ఓ వ్యక్తి యువతిని దారుణంగా మోసం చేశాడు. ఆమె వద్ద నుంచి ఫోటోలు తీసుకొని.. ఆ తర్వాత వాటిని చూపించి బ్లాక్ మొయిల్ చేయడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో యువతి దగ్గర నుంచి లక్షల్లో డబ్బు గుంజాడు. కాగా.. అతని వేధింపులు రోజు రోజుకీ పెరిగిపోతుండటంతో తట్టుకోలేకపోయిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన హైదరాబాద్ లో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఏపీలోని విశాఖపట్టణానికి చెందిన జంబాడ లక్మీ వరప్రసాద్‌.. సీరియల్‌ యాక్టర్‌ రవికృష్ణ పేరుతో ఫేస్‌బుక్‌లో ఓ ప్రొఫైల్‌ క్రియేట్‌ చేశాడు. దుండిగల్‌కు చెందిన ఓ యువతి అతడి ఫ్రెండ్‌ రిక్వె్‌స్టను ఆమోదించారు. వరప్రసాద్‌ కొంతకాలం ఆమెతో చాటింగ్‌ చేసి.. మగ్గులోకి దింపాడు. ఆమె ఫొటోలను సంపాదించి.. బ్లాక్‌మెయిల్‌ ప్రారంభించాడు. విడతలవారీగా రూ.2.20 లక్షలు తీసుకున్నాడు. మరింత డబ్బు కావాలని వేధిస్తుండడంతో.. బాధితురాలు సైబరాబాద్‌ పోలీసులను ఆశ్రయించారు. ఇన్‌స్పెక్టర్‌ గంగాధర్‌ నేతృత్వంలోని బృందం.. నిందితుడి ఆటకట్టించింది. కోర్టులో పక్కా ఆధారాలతో చార్జిషీటు దాఖలు చేసింది. సోమవారం ఈ కేసులో కూకట్‌పల్లి కోర్టు తుదితీర్పు వెలువరించింది. నిందితుడు వరప్రసాద్‌కు రెండేళ్ల జైలు శిక్ష, రూ.వెయ్యి జరిమానా విధించింది.
 

click me!