సింగరేణి శ్రీరాంపూర్‌ గనిలోప్రమాదం: ఇద్దరు కార్మికులకు గాయాలు

By narsimha lodeFirst Published Nov 11, 2021, 12:16 PM IST
Highlights

మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఆర్‌కె -7 గనిలో గురువారం నాడు ప్రమాదం చోటు చేసుకొంది.ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికులకు గాయాలయ్యాయి.  నిన్ననే మంచిర్యాల జిల్లాలోని సింగరేణిలో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు చనిపోయిన విషయం తెలిసిందే.

మంచిర్యాల: మంచిర్యాల జిల్లా సింగరేణి గనిలో గురువారం నాడు మరో ప్రమాదం చోటు చేసుకొంది.ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన కార్మికులను ఆసుపత్రికి తరలించారు.శ్రీరాంపూర్ ఆర్‌కె -7 గని ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.బుధవారం నాడు మంచిర్యాల జిల్లాలోని సింగరేణిలో శ్రీరాంపూర్ బొగ్గు గని-3లో ప్రమాదం చోటు చేసుకొంది.ఈ ప్రమాదంలో  నలుగురు మరణించారు. విధులు నిర్వహిస్తున్న కార్మికులపై గని పైకప్పు కుప్పకూలింది. ఈ ఘటనలో కృష్ణారెడ్డి, లక్ష్మయ్య, నరసింహరాజు, చంద్రశేఖర్ లు మరణించారు. 

Singaeni గనిలో ప్రమాదం జరిగి 24 గంటలు గడువక ముందే మరో ప్రమాదం జరగడంతో కార్మికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో కాకతీయ భూగర్బగనిలో ప్రమాదం చోటు చేసుకొంది. ఈ ఘటనలో ఇద్దరు కార్మికులు మరణించారు. పై కప్పు గురించి అధికారులకు సమాచారం అందించినా సరైన చర్యలు తీసుకోని కారణంగానే ఈ ప్రమాదం చోటు చేసుకొందని కార్మిక సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు.

గత ఏడాది అక్టోబర్ లో నవీన్ అనే కార్మికుడు ప్రమాదంలో మరణించారు. రామగుండం మైన్ లో అండర్ గ్రౌండ్ మైన్ లో ప్రమాదంలో ఆయన మరణించారు. సింగరేణి గనుల్లో పలు accidents చోటు చేసకొన్నాయి. 2020 సెప్టెంబర్ మాసంలో మంచిర్యాల జిల్లాలోని శ్రీరాంపూర్ ప్రాంతంలో ఆర్‌కెఎస్‌బీ భూగర్భ గనిలో పేలుడు జరిగింది. ఈ ప్రమాదంలో ఓ కార్మికుడు మరణించగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.డిటోనేటర్ మిస్ ఫైర్ కావడం వల్లే ఈ ఘటన చోటు చేసుకొంది. 2020 జూన్ మాసంలో పెద్దపల్లి జిల్లాలో గనిలో జరిగిన పేలుడులో నలుగురు సింగరేణి కార్మికులు మరణించారు. మరో ముగ్గురు గాయపడ్డారు. పేలుడు పదార్ధాలు ప్రమాదవశాత్తు పేలడం వల్ల ఈ ఘటన చోటు చేసుకొందని పోలీసులు తెలిపారు.


 

click me!