హైదరాబాద్‌లో ఇద్దరు కానిస్టేబుళ్లపై తల్వార్తో దాడి

Published : Jan 05, 2023, 05:03 PM IST
హైదరాబాద్‌లో ఇద్దరు కానిస్టేబుళ్లపై తల్వార్తో దాడి

సారాంశం

హైదరాబాద్‌లోని జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. ఇద్దరు కానిస్టేబుళ్లపై  దుండగుడు తల్వార్‌తో దాడి చేశాడు.

హైదరాబాద్‌లోని జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. ఇద్దరు కానిస్టేబుళ్లపై  దుండగుడు తల్వార్‌తో దాడి చేయడం  తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఘటనలో గాయపడిన కానిస్టేబుళ్లు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వివరాలు.. కానిస్టేబుళ్లు రాజు, వినయ్‌‌లు మాదాపూర్ ఎస్‌వోటీ ప‌రిధిలో విధులు నిర్వ‌ర్తిస్తున్నారు. వీరు ఓ కేసు దర్యాప్తు నిమిత్తం సిక్కుల బస్తీకి వెళ్లినట్టుగా తెలుస్తోంది. అక్కడ గుర్తు తెలియని ఓ వ్యక్తి  తల్వార్తో వారిపై దాడి చేశాడు. రాజు అనే కానిస్టేబుల్ను దుండగుడు ఛాతీలో పొడవగా, వినయ్‌కు తలపై గాయాలయ్యాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని.. తీవ్రంగా గాయపడిన ఇద్ద‌రు కానిస్టేబుల్స్‌ను చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. 

ప్రస్తుతం రాజు, వినయ్‌లకు కూకట్‌పల్లి రాందేవ్ రావు ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతుంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కానిస్టేబుళ్లను పోలీసు ఉన్నతాధికారులు పరామర్శించారు. కానిస్టేబుళ్లపై త‌ల్వార్‌తో దాడి చేసిన వ్య‌క్తిని గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నాలు జరుపుతున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

ఫ్యూచర్ సిటీ భవనాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి CM Revanth Reddy Inaugurates Future City
CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్| Asianet Telugu