ఎమ్మెల్యేల ప్రలోభాల కేసు సీబీఐకి అప్పగింత: విచారణ రేపటికి వాయిదా వేసిన తెలంగాణ హైకోర్టు

By narsimha lode  |  First Published Jan 5, 2023, 4:47 PM IST


ఎమ్మెల్యేల ప్రలోభాల కేసును సీబీఐకి అప్పగించడాన్ని నిరసిస్తూ  తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్  పై విచారణను రేపటికి వాయిదా వేసింది తెలంగాణ సర్కార్.


హైదరాబాద్: ఎమ్మెల్యేల ప్రలోభాల కేసును సీబీఐకి అప్పగించడాన్ని సవాల్ చేస్తూ  తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై విచారణను  శుక్రవారానికి వాయిదా వేసింది  తెలంగాణ హైకోర్టు .ఎమ్మెల్యే  ప్రలోభాల కేసును సీబీఐకి అప్పగిస్తూ  తెలంగాణ హైకోర్టు సింగిల్ జడ్జి  ఇచ్చిన తీర్పును సవాల్  చేస్తూ  తెలంగాణ ప్రభుత్వం  నిన్న  హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ప్రలోభాల కేసును  సీబీఐకి అప్పగిస్తూ తెలంగాణ హైకోర్టు 2022 డిసెంబర్  26వ తేదీన  సీబీఐ  కి అప్పగిస్తూ  తీర్పును వెల్లడించింది.  ఈ విషయమై ఐదుగురు దాఖలు చేసిన పిటిషన్లలో  రెండు పిటిషన్లను  తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. మూడు పిటిషన్లను అనుమతించింది.  సిట్ కాకుండా సీబీఐతో విచారణకు  పిటిషనర్లు డిమాండ్  చేశారు. ఈ  కేసును సీబీఐతో విచారణకు ఆదేశించింది. ఈ తీర్పును తెలంగాణ ప్రభుత్వం సవాల్ చేసింది.  ఈ పిటిషన్ పై  ఇవాళ  తెలంగాణ హైకోర్టులో  ప్రభుత్వం తరపున  దుశ్యంత్ ధవే వాదించారు.  ప్రభుత్వం తరపున వాదనలు పూర్తయ్యాయి. ప్రతివాదుల తరపున వాదనలు కొనసాగుతున్నాయి.  రేపు కూడా వాదనలు కొనసాగనున్నాయి.  ఈ కేసు విచారణను రేపు మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు.

Latest Videos

undefined

గత ఏడాది  అక్టోబర్  26న  నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేస్తూ  పోలీసులకు ముగ్గురు పట్టుబడ్డారు. అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు,  పినపాక ఎమ్మెల్యే  రేగా కాంతారావు, కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి , తాండూరు ఎమ్మెల్యే  పైలెట్ రోహిత్ రెడ్డిలను ప్రలోభాలకు గురి చేశారని  పోలీసులకు  ఫిర్యాదు  అందింది. ఈ విషయమై  తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి  ఫిర్యాదు మేరకు  మొయినాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు.  ఈ కేసులో  రామచంద్రభారతి, సింహయాజీ,  నందకుమార్ లను  పోలీసులు అరెస్ట్  చేశారు. వీరికి హైకోర్టు బెయిల్  మంజూరు చేసింది.  

also read:బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ప్రలోభాల కేసు: సీబీఐ విచారణకు తెలంగాణ హైకోర్టు అనుమతి

ఈ కేసు విచారణకు గాను  హైద్రాబాద్ సీపీ సీవీ ఆనంద్ నేతృత్వంలో  సిట్ ను ఏర్పాటు  చేస్తూ  తెలంగాణ ప్రభుత్వం  ఉత్తర్వులు జారీ చేసింది.  అయితే  సిట్  తో కాకుండా  సీబీఐ లేదా  స్వతంత్ర దర్యాప్తు  సంస్థతో  విచారణ కోరుతూ  బీజేపీ  పిటిషన్ దాఖలు చేసింది.  బీజేపీ  రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి తో పాటు మరో నలుగురు ఇదే  డిమాండ్ తో  పిటిషన్లను దాఖలు చేశారు.  అయితే  టెక్నికల్  అంశాలను  ప్రాతిపదికగా తీసుకున్న  తెలంగాణ హైకోర్టు  బీజేపీ సహా  మరొకరి  పిటిషన్ ను కొట్టివేసింది. ఈ కేసును సీబీఐ విచారణ కోరుతూ  మరో ముగ్గురు దాఖలు చేసిన పిటిషన్లను  సీబీఐ పరిగణనలోకి తీసుకుంది.అంతేకాదు  సిట్ దర్యాప్తును నిలిపివేయాలని  హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

click me!